Janhvi Kapoor: జాన్వీ కపూర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఉపాసన కొణిదెల..

Jahnvi Kapoor: జాన్వీ కపూర్ కు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ జాన్వీకి రామ చరణ్ ఇచ్చిన గిఫ్ట్ విషయానికొస్తే..

 

1 /7

Jahnvi Kapoor: మెగాస్టార్ చిరంజీవి ఇంటి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల  గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అపోలో హాస్పిటల్ కు సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తూనే మెగా ఇంటి కోడలిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా జాన్వీ కపూర్ కు ఉపాసన .. అత్తమ్మ కిచెన్ కు కు సంబంధించిన గిఫ్ట్ ప్యాక్ ను కానుకగా ఇచ్చింది. ఈ కిచెన్ ప్యాక్ లో రెడీమేడ్ పొంగలి, పులిహోరా, కేసరి బాత్, రసం వంటివి ఈజీగా చేసుకోవచ్చు.

2 /7

జాన్వీ కపూర్ విషయానికొస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఆర్సీ 16 టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 27న ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

3 /7

జాన్వీ కపూర్.. రామ్ చరణ్ సినిమా కంటే ముందు.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ చిత్రంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్ ను అందుకుంది. త్వరలో దేవర పార్ట్ 2 సెట్స్ పైకి వెళ్లనుంది. 

4 /7

జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ లకు తొలి సంతానంగా ముంబైలో జన్మించింది. తల్లి శ్రీదేవి బాటలో తెలుగు చిత్రాలతో స్టార్ కావాలని  కావాలని ప్రయత్నాలు షురూ చేసింది. ఫస్ట్  ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో   తెలుగులో ఎంట్రీ ఇచ్చి గుడ్ స్టార్ట్ చేసింది. త్వరలో రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాతో ఇక్కడ తెలుగులో స్టార్ హీరోయిన్ గా జెండా పాతాలని చూస్తోంది.     

5 /7

జాన్వీ కపూర్ కథానాయికగా ఇండస్ట్రీలో  అడుగుపెట్టి  దాదాపు 8 యేళ్లు చేసుకోబోతుంది. అయినా.. ఇప్పటికీ కథానాయికగా  బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి. అందుకే దక్షిణాది  సినీ ఇండస్ట్రీపై నజర్  పెట్టింది. త్వరలో అల్లు అర్జున్, నాని సినిమాల్లో హీరోయిన్ గా ఈమె పేరు దాదాపు ఖరారైంది.

6 /7

  జాన్వీ కపూర్.. హిందీ చిత్రం 'ధడక్‌'తో  కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. కానీ ఆ త‌ర్వాత జాన్వీ యాక్ట్ చేసిన  చిత్రాలు ఎక్కువగా  థియేటర్ లో కాకుండా.. ఓటీటీ వేదికగా విడుదలయ్యాయి. 

7 /7

  జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగానే వరుసగా అవకాశాలు వస్తున్నాయనే చెప్పాలి. ఈమెకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో 26 మిలియన్స్ కు పైగా  ఫాలోవర్స్ ఉన్నారు.