Dates: మీరు తింటున్న ఖర్జురాలు నిజమైనవా లేదా కల్తీవా ఇలా ఈజీగా కనిపెట్టేయోచ్చు..!

Dates adulterated: రంజాన్ మాసంలో చాలా  మంది ఖర్జురాలను ఎంతో ఇష్టంతో తింటారు. అయితే.. మార్కెట్లలో ప్రస్తుతం కల్తీవే వస్తున్నాయి. ఏదీ కొనాలన్న ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది.
 

1 /6

చాలా మంది హెల్తీ ఫుడ్ లను తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా రంజాన్ పండుగ వేళ ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా ఉపవాసం ఉంటారు.  

2 /6

ఈ సమయంలో ఖర్జురాలను ఎక్కువగా తింటు ఉంటారు. దీనితోపాటు డ్రై ఫ్రూట్స్, ఇతర ఫలాలను ఎక్కువగా తీసుకుంటారు. సాయంత్రం వేళల్లో ఉపవాసాలు ముగించుకుని డ్రై ఫ్రూట్స్ తింటు ఉంటారు.

3 /6

ముఖ్యంగా ఖర్జురాలలో విటమిన్ లు, మన శరీరంకు కావాల్సిన అన్నిరకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఖర్జురాలను రాత్రి పూట నీళ్లలో నానబెట్టి ఉదయం పూడా తింటారు.

4 /6

మార్కెట్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా బండ్ల మీద, షాపుల్లో ఖర్జురాలను రాశులుగా పోసీ మరీ విక్రయిస్తున్నారు. అయితే.. వీటిలో ఖర్జురాలు కల్తీవా లేదా అనేది ఎలా తెలుసుకొవాలో ఇప్పుడు చూద్దాం.

5 /6

నిజమైన ఖర్జురాలు నిండుగా ఉంటాయి. జిగటగా చేతికి అతుక్కొవు. తింటే ఒకరకమైన స్వీట్ నెస్ ఉంటుంది. కానీ కల్తీవైన ఖర్జురాలను చేతితో ముట్టుకుంటే జిగటగా అంటుకుంటాయి. చేతికి చక్కెర పానకంలా అతుక్కుటుంది.  కొన్ని రకాల ఖర్జురాలను చక్కెర,బెల్లం పానకంలో వేడి చూసి తయారు చేస్తారు. ఇవి అచ్చం నిజమైన ఖర్జురాల మాదిరిగానే ఉంటాయి.

6 /6

కానీ నిజమైన ఖర్జురాలు చేతితో ముట్టుకుంటూ అస్సలు బంకలా అంటుకొవు. అవి చాలా రోజులు నిల్వఉంటాయి.కల్తీ ఖర్జురాలు రెండు, మూడు రోజులు కాగానే.. వాటిలో నుంచి జిగటగా ఒక రకమైన పల్చని ద్రావణం కారుతు ఉంటుంది.