Ramya Krishnan Shocking Comments : 1990 లో స్టార్ హీరోయిన్స్ ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రమ్యకృష్ణ. ఒక రకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తను చెయ్యని పాత్ర లేదు. ఎంతోమంది ఇండస్ట్రీకి రావాలనుకున్న వారికి ఆమె ఇన్స్పిరేషన్ గా కూడా నిలిచింది. అలాంటి రమ్యకృష్ణ క్యాస్టింగ్ గా ఉంచు గురించి కీలక వ్యాఖ్యలు చేసింది..
హీరోలకు దీటుగా నటించే హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ముందంజులో ఉంటుంది రమ్యకృష్ణ. రజినీకాంత్ లాంటి హీరోని కూడా.. తన నటనతో దాటేసింది రమ్యకృష్ణ. నరసింహ సినిమా అనగానే రజినీకాంత్ కన్నా ఎక్కువ రమ్యకృష్ణ నీలాంబరి క్యారెక్టర్ గుర్తొస్తుంది.
మరోపక్క పాన్ ఇండియా సినిమా బాహుబలి గురించి తలుచుకుంటే అందరికీ తప్పకుండా గుర్తొచ్చే పేరు శివగామి. నా మాటే శాసనం అని రమ్యకృష్ణ చెప్పే ఒక్క డైలాగ్ చాలు ఆమె పవర్ఫుల్ నటన గురించి ఈ తరం వారికి తెలియదానికి.
దక్షిణ భారత సినీ పరిశ్రమలో నలభై ఏళ్లకు పైగా అగ్రనటిగా వెలుగొందిన రమ్యకృష్ణ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. “ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవాలంటే దర్శకుడు, హీరో.. రూముకు వెళ్లాల్సిందే” అనే ఆమె మాటలు సినీ ప్రియుల్లో కలకలం రేపుతున్నాయి.
రమ్యకృష్ణ సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె “నేరం పూరలుంబోరే” అనే మలయాళ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ, “చిత్ర పరిశ్రమలో ఎక్కువగా మహిళలు ముందుకు రావాలంటే చాలా అవమానాలు భరించాలి. దర్శకుడు లేదా హీరో చెప్పినట్లే చేయకపోతే అవకాశాలు రావు. కొన్నిసార్లు వారి కోరికలు తీరాల్సి ఉంటుంది. లేదంటే మన కెరీర్ అక్కడే ఆగిపోతుంది,” అని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోని గుట్టుచప్పుడు కాకున్న వాస్తవాలను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. సినీ రంగంలో అవకాశాల కోసం మహిళలు ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.