Liver Damage Signs: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మద్యం, ధూమపానం వంటివి లివర్ చెడిపోవడానికి ముఖ్య కారణం. లివర్ దెబ్బతిన్నప్పుడు మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1/6ప్రస్తుత కాలంలో ఆధునిక జీవనశైలి కారణంగా అనేక రకాల రోగాలు నిరంతరం చుట్టుముడుతూనే ఉన్నాయి. అయితే మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం లివర్. మానవ శరీరానికి గుండె, మెదడు ఎంత ముఖ్యమో లివర్ కూడా అంతే ముఖ్యం. లివర్ సమస్యలు వస్తే శరీరం మొత్తం ప్రభావితమవుతుంది. అందుకే లివర్ ఆరోగ్యంపై అందరూ జాగ్రత్తగా ఉండాలి.
2/6అరికాళ్లపై దురద: లివర్ దెబ్బతిన్నప్పుడు అరికాళ్లు తరచుగా దురద పెడుతుంటాయి. అలాగే ఈ దురద కూడా అంత తేలికగా తగ్గదు. కాబట్టి ఈ లక్షణం కనిపిస్తే మీ లివర్ ప్రాబ్లమ్‌లో ఉన్నట్లేనని గుర్తించి.. ముందుగానే అలర్ట్ అవ్వండి.
3/6అరికాళ్లలో వాపు మరియు నొప్పి: కొంతమందికి తరచుగా పాదాల అడుగు భాగంలో లేదా అరికాళ్లలో వాపు మరియు నొప్పి వస్తుంది. ఇటువంటి లక్షణాలను అసలు తేలికగా తీసుకోకూడదు. ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే లివర్ చెడిపోవడం ప్రారంభమవుతుంది.
4/6పాదాలలో దుర్వాసన: పాదాలలో ముఖ్యంగా అరికాళ్లలో తరచుగా దుర్వాసన వస్తుంటే.. దానిని అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఇది కూడా మీ లివర్ డేంజర్‌లో ఉందనే దానికి పెద్ద సంకేతం.
5/6అరికాళ్లలో వెచ్చదనం: కొన్ని సందర్భాల్లో అరికాళ్లు వెచ్చగా అనిపించవచ్చు. ఇది కూడా లివర్ సమస్యకు సంకేతం. లివర్ మన శరీరంలో రక్తాన్ని సరిగ్గా శుభ్రం చేయనప్పుడు.. అరికాళ్లు వెచ్చగా అనిపిస్తాయి.
6/6కాలి గోళ్లలో తెల్లటి రంగు: మీ కాలి గోళ్లు తెల్లగా మారడం ప్రారంభిస్తే, అది లివర్ దెబ్బతిన్నదానికి సంకేతం కావచ్చు. ఈ లక్షణాలన్నీ ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు కాబట్టి వైద్యుడిని సంప్రదించడం మంచిది. లివర్ ఆరోగ్యం కోసం తక్కువ కొవ్వు ఉన్న చికెన్, చేపలు, బీన్స్ వంటి ఆహారాలు తీసుకోవాలి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారం కూడా చాలా మేలు చేస్తుంది.