Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ తో ఫిదా చేస్తోన్న రష్మిక మందన్న..

ashmika Mandanna : రష్మిక మందన్న కెరీర్ పరంగా  ఫుల్ జోష్ లో ఉంది. గత కొన్నేళ్లుగా వరుస ప్యాన్ ఇండియా చిత్రాలతో  బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. గతేడాది చివర్లో ‘పుష్ప 2’తో బాక్సాఫీస్ దుమ్ము దులిపిన రష్మి.. ఈ ఇయర్ ‘ఛావా’తో మరో బ్లాక్ బస్టర్ ను అందుకుంది. త్వరలో సల్మాన్ ‘సికిందర్’ మూవీతో పలకరించబోతుంది. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా బ్లాక్ డ్రెస్ లో కనిపించి అభిమానులను కనువిందు చేసింది.

1 /6

Rashmika Mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం మన దేశంలో అస‌లు సిస‌లు  ప్యాన్ ఇండియా స్టార్ హీరోయిన్ . లాస్ట్ ఇయర్ ‘పుష్ప 2’ తో  బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ ను అందుకుంది.  అంతకు ముందు ‘యానిమల్’, పుష్ప పార్ట్ 1 సినిమాలతో అన్ని ఇండస్ట్రీ వాళ్లకు ఫేవరేట్ అయింది.

2 /6

  ఈ యేడాది విక్కీ కౌశల్ హీరోగా నటించిన ‘ఛావా’ సినిమాలో శంభాజీ మహారాజ్ భార్య యశో బాయి పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువ అయింది. దీంతో ఈమెను అందరు గోల్డెన్ లెగ్ గా అభివర్ణిస్తున్నారు.

3 /6

రష్మిక మందన్నశాండిల్ వుడ్  అయినా.. తెలుగులో ‘ఛలో’ మూవీతో ఇంట్రడ్యూస్ అయింది.  ఈమె కర్ణాకటలోని కొడుగు జిల్లాలోని విరాజ్ పేటలో  1996 ఏప్రిల్ 5న జన్మించింది. అంతేకాదు అక్కడ స్థానికంగా ఉండే కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది.

4 /6

ఇప్పటికే రష్మిక బాలీవుడ్ లో పుష్ప, యానిమిల్, పుష్ప 2, ఛావా చిత్రాలతో రష్మిక క్రేజ్ ఆకాశాన్ని అంటింది. త్వరలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘సికందర్’ మూవీతో పలకరించబోతుంది. ఈ సినిమా ఉగాది మరియు ఈద్ రెండు పండగల నేపథ్యంలో రిలీజ్ కాబోతుంది.

5 /6

రష్మిక ఇతర భాషల్లో ఏదో నటించామన్నట్టు కాకుండా..  తెలుగు సహా వివిధ భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటోంది.  ఓ రకంగా ఇపుడున్న హీరోయిన్స్ కు ఆదర్శంగా నిలుస్తుంది. రష్మిక ఆంగ్ల సాహిత్యం, జర్నలిజంలో కూడా బ్యాచిలర్ డిగ్రీ సంపాదించింది. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు దక్కించుకుంది.  

6 /6

  రష్మిక హిందీ సినిమాల్లో నటించే ముందే 'టాప్ టక్కర్' ఆల్బమ్‌లో నటించి అక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది.రష్మిక ప్రస్తుతం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా పనిచేస్తోంది. తనకున్న వరల్డ్ వైడ్ క్రేజ్ తో ఆ బ్రాండ్స్ కు ప్రచారం చేస్తోంది. రష్మిక ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి కామర్స్, సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు.