Rashmika mandanna on periods pain: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన వ్యాఖ్యల్ని పూర్తిగా తప్పుగా అర్థం వచ్చేలా కొంత మంది వైరల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.అసలు ఇంటర్వ్యూలకు వెళ్లాలంటేనే భయమేస్తోందన్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల నెట్టింట బాగా హల్ చల్ చేస్తున్నారు. గత నెల రోజుల నుంచి విజయ్ దేవర కొండ, రష్మికలకు ఎంగెజ్ మెంట్ అయిపోయిందని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయిన కూడా వీటిపై ఇద్దరు అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.
మరోవైపు రష్మిక మాత్రం ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలో ఇన్ డైరెక్ట్ గా ఎంగెజ్ మెంట్ రింగ్, విజయ్ దేవర కొండతో పెళ్లి అన్నట్లు హింట్ మాత్రం ఇచ్చారు. ఇక నెటిజన్లు ఈ హింట్ తో రెచ్చిపోయి.. ఇంకా ఇంతకన్నా ప్రూఫ్ఏంకావాలంటూ రష్మిక, విజయ్ ల అధికారిక ప్రకటన కోసం కళ్లు కాయలు కాచేలా వేచిచూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల రష్మిక మందన్న మూవీ ది గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ నేపథ్యంలో జగపతిబాబు 'జయమ్ము నిశ్చయమ్మురా'.. టాక్ షోలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రష్మిక పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు అనుభవించే నరకం గురించి మాట్లాడారు. అంతటితో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి... 'అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే... ఆబాధ తెలుస్తుందన్నారు.
రష్మిక మాట్లాడుతూ..'మగాళ్లకు ఓసారి పీరియడ్స్ వస్తే... ఆడవాళ్లు పడే బాధ అర్థమవుతుందని... ఆ నొప్పి, అసౌకర్యం, మూడ్ స్వింగ్స్ అన్నీ అర్థం చేసుకోవాలంటే అబ్బాయిలకు లైఫ్ టైమ్ లో ఒక్కసారి పీరియడ్స్ రావాలన్నారు. ఈ కామెంట్స్ నెట్టింట ఒక రేంజ్ లో వైరల్గా మారాయి.
దీనిపై పెద్ద వివాదం రాజుకుంది. ఆడవాళ్లు పీరియడ్స్ పెయిన్ అనుభవిస్తే.. మగాళ్లకు వారి బాధలు వారికి ఉంటాయని.. ప్రతిరోజు వారు పడే టెన్షన్ లు మీకేం తెలుసంటూ నెట్టింట రష్మికను ఒక రేంజ్ లో నెటిజన్లు ట్రోల్స్ చేశారు. దీనిపై తాజాగా.. రష్మిక మందన్న రియాక్ట్ అయ్యారు.
అసలు ఇంటర్వ్యూలకు, షోలకు వెళ్లాలంటేనే భయంగా ఉందని, తన వ్యాఖ్యల్ని చాలా వక్రీకరించారని చెప్పుకొచ్చింది. మగాళ్లకు పీరియడ్స్ పెయిన్ వస్తే ఆడవారి బాధ తెలుస్తుందనిమాత్రమే అన్నానని చెప్పుకొచ్చారు. అంతేకానీ మగాళ్లకు కష్టాలు ఉండవని కానీ.. మరో ఉద్దేష్యం తనకులేదని క్లారిటీ ఇచ్చారు.