Rashmika Mandanna Love Fail With Her At Age Of 21 Years: సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ వెనుక అనేక కష్టనష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఉన్న గుర్తింపు కన్నా వారి వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న కీలక ఘట్టాలు ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తతం నేషనల్ క్రష్‌గా ఉన్న రష్మిక మందన్నా వ్యక్తిగత జీవితం వేరు.. సినిమా జీవితం వేరు. ఇప్పుడే పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయి.
తెలంగాణ హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో.. అదే వాస్తవమైతే రష్మిక మందన్నా జీవితం చక్కబడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వస్తుండగా.. అయితే రష్మికకు గతంలోనే ఓ లవ్ ఫెయిల్ అయ్యింది. అతడితో నిశ్చితార్థం చేసుకుని ఆ తర్వాత విడిపోయింది. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం.
కన్నడ సినీ పరిశ్రమలో రక్షిత్ శెట్టి నటుడిగా కొనసాగుతున్నాడు. ఇటీవల చార్లీ 777 చిత్రంతో భారీ హిట్ పొందాడు. అయితే రక్షిత్, రష్మిక ఇద్దరూ కలిసి ఒక సినిమా చేశారు. 2016లో కిరిక్ పార్టీ అనే సినిమా రక్షిత్, రష్మిక చేయగా.. అదే రష్మికకు తొలి సినిమా.
సినిమా షూటింగ్ సమయంలోనే రక్షిత్, రష్మిక మధ్య ప్రేమ చిగురించి పెళ్లి దాకా అడుగులు పడ్డాయి. అందులో భాగంగా జూలై 2017లో రక్షిత్, రష్మిక మందన్నా వైభవంగా నిశ్చితార్థ వేడుక చేసుకున్నారు. ఇద్దరు ఉంగరాలు మార్చుకుని సరికొత్త జీవితం ప్రారంభించారు. అయితే వారి బంధం కొన్నాళ్ల పాటు మాత్రమే సాగింది. ఆ తర్వాత విడిపోయారు.
రక్షిత్‌ను నిశ్చితార్థం చేసుకున్న సమయంలో రష్మిక మందన్నా వయస్సు 21 ఏళ్లు. అప్పుడు రక్షిత్‌కు 34 ఏళ్లు ఉన్నాయి. నిశ్చితార్థ వేడుకలో ఉంగరాలు మార్చుకున్న అనంతరం కేక్ కట్ చేశారు. ఆ ఫొటోలు, వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 2018 నాటికి నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. భేదాభిప్రాయాల కారణంగా వారిద్దరూ వేర్వేరు దారులు చూసుకున్నారు.
ఇది జరిగిన తర్వాత రష్మిక మందన్నా కన్నడ సినీ పరిశ్రమ కన్నా తెలుగుపై దృష్టి పెట్టారు. ఇక్కడ విజయ్ దేవరకొండతో జత కట్టి భారీ హిట్లు పొందగా.. అనంతరం పుష్ప సినిమాలతో నేషనల్ క్రష్‌గా మారారు. ఇప్పుడు ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాతో హీరోయిన్ ఒరియెంటెడ్‌గా గుర్తింపు పొందారు.
ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో రష్మిక మందన్నా మాట్లాడుతూ.. తన నిశ్చితార్థం ఫెయిలవడాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఫెయిలైనట్లు తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకుని మూడడుగులు వేయబోతున్నట్లు సమాచారం. అప్పుడు ప్రేమలో ఓడిపోయి.. ఇప్పుడు ప్రేమలో గెలవడమే కాకుండా సినిమాల పరంగా కూడా రష్మిక విజయం సాధిస్తున్నారు.