Vijaya Devarakonda : విజయ దేవరకొండ, రష్మిక తమ ఇద్దరి ప్రేమ గురించి అధికారికంగా ఎప్పుడు చెబుతారో తెలియదు కానీ.. అంతలోపలే వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారు అని.. వీళ్ళిద్దరి ఇన్స్టాగ్రామ్ ఫోటోలు చూసిన అందరూ మాత్రం ఫిక్స్ అయిపోతున్నారు.. ఎప్పటిలానే మరోసారి కూడా ఈ జంట సోషల్ మీడియాలో బుక్ అయ్యారు..
1/5విజయ్ దేవరకొండ, రష్మిక.. కావాలనే చేస్తారో లేకపోతే తెలియక చేస్తారో అర్థం కాదు కానీ.. మొత్తం పైన తాము ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉంటున్నాము అని క్లూస్ పైన క్లోజ్ ఇస్తూ ఉంటారు.
2/5ముఖ్యంగా రష్మిక.. విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంటుంది అనేదానికి ఆమె ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు.. ఆమె ఫోటోలు అన్నిట్లో కూడా విజయ్ దేవరకొండ ఇంటి బ్యాగ్రౌండ్ ఉంటుంది. దీంతో అందరూ కూడా ఈ ఫోటోలు షేర్ చేస్తూ.. వీరిద్దరూ ఏకంగా సహజీవనమే చేస్తున్నారు అని కామెంట్లు కూడా పెడుతున్నారు.
3/5ఇక ముందు లాగానే ఈసారి కూడా.. రష్మిక అలాంటి పనే చేసి బుక్ అయిపోయింది. రష్మిక తాజాగా విజయదశమి రోజు దసరా శుభాకాంక్షలు అంటూ ఒక పోస్ట్ వేసింది. అందులో చీర కట్టుకొని.. కుంకుమ పెట్టుకొని.. అటు ఇటు చుస్తున్న ఫోజులు అన్ని షేర్ చేసింది.
4/5ఇక ఈ ఫోటోలలో రష్మిక నిలబడుకొన్న డోర్.. గతంలో విజయ్ దేవరకొండ అలానే విజయ్ దేవరకొండ అమ్మ షేర్ చేసిన ఫోటోలలో రూమ్ డోర్స్ అన్ని కూడా ఒకేలాగా ఉన్నాయి. దీంతో రష్మిక విజయదశమి కూడా విజయ్ దేవరకొండ ఇంట్లోనే జరుపుకుంది అంటూ.. ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు అభిమానులు.
5/5ఇక ఈ విషయం కాస్త.. వీరిద్దరి అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. మరోపక్క వీళ్లిద్దరూ పెళ్లి గురించి ఎప్పుడెప్పుడు చెప్పేస్తారా అని అందరూ కూడా ఎదురుచూస్తున్నారు.