Rashmika Mandanna: మీరు చేస్తుంది కరెక్ట్ కాదు.. హెచ్​‌సీయూ ఘటనపై చివాట్లు పెట్టిన రష్మిక మందన్న..!.. సంచలనంగా మారిన పోస్ట్..

Rashimika mandanna on hcu controversy: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ భూముల వివాదం ప్రస్తుతం కాకరేపుతుంది.ఈ ఘటనపై ఇప్పటికే హైకోర్టులో పలు పిటిషన్ లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా దీనిపై తనదైన స్టైల్లో స్పందించారు. అసలు హైదరాబాద్లో ఏంజరుగుతుందని ఫైర్ అయ్యారు.
 

1 /5

హైదరాబాద్ హెచ్ సీయూ ఫారెస్ట్ భూముల వివాదం ప్రస్తుతం దేశంలో హట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఓవర్ నైట్ లో యాభైకుపైగా జేసీబీలతో రాత్రికి రాత్రేహెచ్ సీయూలో ఉన్న అడవిని చదును చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో దీన్ని విద్యార్థి నాయకులు అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాలనేతలు కూడా తమ నిరసనలు తెలిపారు .

2 /5

ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి.. నిరసన తెలియజేస్తున్నవారందర్ని కూడా అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఘటనకాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఘటనపై బీజేపీ, బీఆర్ఎస్ లు సైతం తమ నిరసనలు తెలియజేశారు. మరోవైపు అడవుల్ని నరికివేసే మారణా కాండా ఆపాలని తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్ లు దాఖలయ్యాయి.  

3 /5

హైదరాబాద్ లోని హెచ్ సీయూ పరిధిలో ఉన్న 400 ఎకరాలను ప్రైవేటు పరం చేసేందుకు, రేవంత్ సర్కారు కుట్రలు చేస్తుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే..దీనిపై రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా.. సెలబ్రీటీలు సైతం తమ గొంతును విన్పిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ ఘటనపై..సమంత, నాగ్ అశ్విన్, ప్రకాష్ రాజ్, ఉపాసన కొణిదెలా, రేణు దేశాయ్ లు స్పందించారు.  

4 /5

ఇక ఆ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక సైతంస్పందించారు. తన సోషల్ మీడియా అకౌంట్లో సంచలన పోస్ట్ పెట్టారు. అసలు హైదరాబాద్ లో ఏంజరుగుతుందన్నారు. తాను ఇప్పుడే ఈ ఘటనను చూశానన్నారు. అసలు ఆ జేసీబీలేంటీ.. విద్యార్థులను అరెస్టు చేయడమేంటనీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

5 /5

ఈ ఘటనతో తన గుండె ముక్కలైందని.. నిజంగా ఇది ఎంత మాత్రం సరైన పనికాదని,దీనిపై మళ్లీ ఆలోచించాలని రష్మిక మందన్న సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.  ఈ క్రమంలో రష్మిక చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అడవిలో ఉన్న వందలాది జీవాలు ప్రస్తుతం దీనంగా అరుస్తున్నాయని..జంతు జాలానికి దయచేసి ఇబ్బందులు కల్గజేయోద్దని కూడా ప్రతి ఒక్కరు రేవంత్ సర్కారును కోరుతున్నారు.