Rashmika Replaces Samantha : సమంత, రష్మిక ఇద్దరూ కూడా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకొని ప్రస్తుతానికి పాన్ ఇండియా పరంగా దూసుకుపోతున్న హీరోయిన్స్. ఇద్దరికీ కూడా విపరీతంగా క్రేజ్ ఉంది. ఈ క్రమంలో సమంత స్థానంలో రష్మిక రావడానికి పెద్ద కథే ఉంది అంటూ.. ఒక వార్త తెగ వినిపిస్తోంది.
1/6సమంత, రష్మిక.. ఇద్దరూ కూడా ప్రస్తుతం తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమాని సమంత ఏలగా.. ఒకరకంగా ఆమె తరువాత ఆ చోటుని రష్మిక దక్కించుకుంది. ఈ క్రమంలో.. ఒక సినిమాలో సమంత స్థానంలో రష్మిక వచ్చింది అన్న వార్త వినిపిస్తోంది.
2/6హర్రర్ కామెడీ యూనివర్స్‌లో.. కొత్తగా జోడవుతున్న సినిమా థమ్మ. దీపావళి సందర్భంగా దినేష్ విజన్, అమర్ కౌశిక్, ఆదిత్య సర్పోట్డార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్నా, పరీశ్ రావల్, నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే స్త్రీ, స్త్రీ 2, ముంజ్యా, భేడియా వంటి సినిమాలు ఈ యూనివర్స్‌లో వచ్చాయి.
3/6అసలు ఈ సినిమా మొదటి ఎంపికగా రష్మిక కాకుండా సమంత రూత్ ప్రభు ఉండాల్సింది. 2022లో సమంతకు మయోసైటిస్.. అనే ఆరోగ్య సమస్య తలెత్తడంతో సినిమాల నుంచి విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇప్పటికే సైన్ చేసిన సినిమాలకు కూడా అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి ఇచ్చి, తన ఆరోగ్యంపై మాత్రమే దృష్టి పెట్టింది. ఈ కారణంగా వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్ పేరుతో ప్లాన్ చేసిన ఈ సినిమా నుంచి తప్పుకుంది.
4/6తర్వాత.. ముంజ్యా విడుదల సమయానికి, నిర్మాతలు రష్మిక మందన్నాను సంప్రదించారు. అప్పటికే ఆమె ఛావా సినిమాలో కూడా ఇదే బ్యానర్‌తో పని చేస్తుండటంతో వెంటనే అంగీకరించింది. దీంతో రష్మికే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది.
5/6ఇక రష్మిక ప్రస్తుతం కాక్టెయిల్ 2 సినిమా చేస్తోంది. ఇదే బ్యానర్‌తో ఆమె చేస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో షాహిద్ కపూర్..కృతి సనన్ కూడా నటిస్తున్నారు.
6/6థమ్మ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. ఇది తొలిసారిగా ఖురానా బ్రదర్స్.. ఆయుష్మాన్, అపార్షక్తి ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అపార్షక్తి ఇప్పటికే స్త్రీ, స్త్రీ 2 సినిమాల్లో భాగమయ్యారు.మొత్తానికి..ఆరోగ్య సమస్యల కారణంగా సమంత వదిలిన ఈ అవకాశాన్ని రష్మిక దక్కించుకుంది. ఇప్పుడు అభిమానులు థమ్మ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.