Ravi Teja Heroines
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజు గా పేరు తెచ్చుకున్నారు రవితేజ. ఒకప్పుడు రవితేజ నటించిన ప్రతి చిత్రం కూడా మంచి విజయం సాధిస్తూ వచ్చాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఆయన సినిమాలకు అంత డిమాండ్ ఉండడం లేదు. ఈ క్రమంలో రవితేజ స్టార్ హీరోయిన్స్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..
1/5ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం లాంటి వరస సూపర్ హిట్లు అందుకున్న రవితేజ ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో.. ఆ తర్వాత మాస్ మహారాజా గా ఎదిగారు.
2/5వరస సూపర్ హిట్స్ అందుకున్న తర్వాత ఎంతోమంది స్టార్ డైరెక్టర్లతో కూడా నటించారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం రవితేజాకు చెప్పుకోదగ్గ విజయం ఒక్కటి కూడా లేదు. క్రాక్, వాల్తేరు వీరయ్య పరవాలేదు అనిపించిన మిగతా సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ గా మిగిలాయి.
3/5ఈ క్రమంలో రవితేజ మళ్ళీ ఎప్పుడు పుంజుకొని మంచి సినిమా చేస్తారు అని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారో. మరోపక్క రవితేజ పాత వీడియో ఒకటి వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది.
4/5హరీష్ శంకర్ తో మిరపకాయ లాంటి సూపర్ హిట్ అందుకున్నారు రవితేజ. ఇక హరీష్ శంకర్ తో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. రవితేజను యాంకర్.. ఇలియానా, త్రిష, శ్రియ, అనుష్క విల నలుగురిలో మీకు ఎవరు ఇష్టం అని అడగగా.. రవితేజ వెంటనే అనుష్క అని చెప్పారు..
5/5అప్పుడు యాంకర్ అయితే ఈ బిట్ కట్ చేసి త్రిష, ఇలియానా, శ్రీయ కు పంపిస్తాము అని చెప్పింది. అసలు చాలా క్యాజువల్గా.. నాకు భయం లేదు అన్నట్టుగా.. రవితేజ పంపించుకోండి అన్నారు. దీంతో అభిమానులు అందరూ.. ఈ వీడియో పై రకరకాల కామెంట్లు పెడుతున్నారు.