Add Zee Business As A Preferred Source
App

Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఘోర అవమానం.. రిటైర్‌మెంట్ ప్రకటన గ్యారంటీ..!

Published: Oct 06, 2025, 12:04 AM IST|Updated: Oct 06, 2025, 12:04 AM IST

Ravindra Jadeja Latest News: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను సెలెక్టర్లు ఆసీస్ టూర్ నుంచి పక్కనబెట్టి అవమానించినట్లయింది. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో సూపర్ ఫామ్‌ చాటుకున్న జడ్డూ.. వెస్టిండీస్‌పై టెస్ట్‌లో సెంచరీతో చెలరేగి బౌలింగ్‌లో 4 వికెట్లు తీశాడు. ఇంతటి ఫామ్‌లో ఉన్న జడేజాను వన్డేలకు సెలెక్ట్ చేయకుండా.. పరోక్షంగా పొగబెట్టి పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 

1/7

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతోపాటే టీ20 వరల్డ్ కప్ విజయం అనంతరం రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. వన్డేలు, టెస్టులు మాత్రం టీమ్‌లో కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. విండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు రిషబ్ పంత్ లేకపోవడంతో తొలిసారి వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు.    

2/7

ఇంగ్లాండ్‌ టూర్‌ టీమిండియా సిరీస్‌ను సమం చేయడంతో జడ్డూ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని బ్యాటింగ్‌లో దుమ్ములేపాడు. 10 ఇన్నింగ్స్‌లలో 516 పరుగులు చేసి 7 వికెట్లు పడగొట్టాడు. విండీస్‌పై తొలి టెస్ట్‌లో సెంచరీ, బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌కు ఎంపికయ్యాడు.   

3/7

ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో సెలెక్టర్లు టీమ్‌ను ప్రకటించారు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి గిల్‌కు బాధ్యతలు అప్పగించారు. అయితే జడేజాను మాత్రం టీమ్‌లో సెలెక్ట్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.   

4/7

రోహిత్, కోహ్లీతోపాటు జడ్డూ కూడా వన్డే టీమ్‌లో ఉంటాడని అందరూ భావించారు. అయితే ఊహించని విధంగా సెలక్టర్లు మొండి చేయి చూపడం అందరినీ షాక్‌కు గురి చేసింది.   

5/7

ఇప్పటికే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ రూపంలో ఇద్దరు ఆల్‌రౌండర్లు ఉన్నందున రవీంద్ర జడేజాకు అవకాశం ఇవ్వలేదని.. ఆస్ట్రేలియాకు ఇద్దరి కంటే ఎక్కువ స్పిన్నర్లు అవసరం లేదంటూ చీఫ్ సెలక్టర్ అగార్కర్ అన్నారు. జడేజా ఎప్పుడు తమ దృష్టిలో ఉంటాడని అన్నారు.  

6/7

బీసీసీఐ తీరు చూస్తుంటే.. 2027 ప్రపంచ కప్‌ టీమ్ ప్రణాళికల్లో జడేజా లేడని క్లియర్‌గా అర్థమవుతుందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. వచ్చే ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో కూడా ఇద్దరి కంటే ఎక్కువ స్పిన్నర్లు అవసరం లేదని.. ఎవరైనా గాయపడితే తప్ప జడేజాకు అవకాశం లభించదని అంటున్నారు.   

7/7

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 ప్రపంచ కప్‌లో ఉంటారని కచ్చితంగా చెప్పలేమని అగార్కర్ అన్నారు. వారి పరిస్థితి అలాగే ఉంటే.. ఇక జడేజాకు ఇకపై వన్డేల్లో అవకాశం లభించడం దాదాపు కష్టం. దీంతో ఈ స్టార్ ఆల్‌రౌండర్ వన్డే ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.