Add Zee Business As A Preferred Source
App

RBI: బాంబు పేల్చిన RBI.. అకౌంట్‌ నుంచి రూ.35వేల కంటే ఎక్కవ విత్‌డ్రా చేసుకోలేం..!!

Written ByBhoomi
Published: Dec 18, 2025, 11:21 AM IST|Updated: Dec 18, 2025, 11:21 AM IST

RBI has taken strict action against Guwahati Cooperative Urban Bank: గౌహతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌పై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో ఖాతాదారులు రూ.35,000కు మించి నగదు విత్ డ్రా చేసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆంక్షలు ఆరు నెలలు అమల్లో ఉంటాయని పేర్కొంది.

Reserve Bank of India1/6

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. గౌహతి సహకార బ్యాంకుపై కఠిన చర్యలు తీసుకుంది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు పలు ఆంక్షలను విధించినట్లు ఆర్‌బిఐ ప్రకటించింది. ఈ చర్యల ప్రభావం బ్యాంకు కస్టమర్లపై నేరుగా పడనుండగా, వారు తమ ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని పూర్తిగా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండదని పేర్కొంది.

Guwahati Cooperative Urban Bank account holder2/6

గౌహతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారు

 

ఆర్‌బిఐ ఆదేశాల ప్రకారం.. గౌహతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారులు తమ సేవింగ్స్, కరెంట్ లేదా ఇతర డిపాజిట్ ఖాతాల నుంచి రూ.35,000 కంటే ఎక్కువ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోలేరు. అయితే.. డిపాజిట్లకు వ్యతిరేకంగా రుణాలను సర్దుబాటు చేసుకునేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. ఈ పరిమితులు ప్రత్యేకంగా ఈ బ్యాంకుకు మాత్రమే వర్తిస్తాయని, ఇతర బ్యాంకులపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్‌బిఐ స్పష్టం చేసింది.

 

 

Restrictions imposed by the Reserve Bank3/6

రిజర్వ్ బ్యాంక్ విధించిన ఆంక్షలు

 

రిజర్వ్ బ్యాంక్ విధించిన ఆంక్షలు మంగళవారం బ్యాంకింగ్ సమయం ముగిసిన వెంటనే అమల్లోకి వచ్చాయి. ఇవి రాబోయే ఆరు నెలల పాటు కొనసాగనున్నాయి. ఈ కాలంలో బ్యాంకు తన కార్యకలాపాలను ఆర్‌బిఐ సూచనల మేరకు మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. గౌహతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆర్‌బిఐ ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి కొత్త రుణాలను మంజూరు చేయకూడదు. అలాగే ఇప్పటికే ఉన్న రుణాలను పునరుద్ధరించే హక్కు కూడా బ్యాంకుకు ఉండదు. అదేవిధంగా, బ్యాంకు కొత్త పెట్టుబడులు పెట్టడం, కొత్త బాధ్యతలు స్వీకరించడం లేదా ఎటువంటి చెల్లింపులు చేయడం కూడా నిషేధించింది.

 

 

Bank's financial situation4/6

బ్యాంకు ఆర్థిక పరిస్థితి

బ్యాంకు ప్రస్తుత ద్రవ్యత స్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. డిపాజిటర్ల డబ్బు భద్రతను కాపాడటమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొంది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

Gauhati Cooperative Urban Bank's performance5/6

గౌహతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పనితీరు

గౌహతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పనితీరును మెరుగుపరచేందుకు ఇటీవల ఆర్‌బిఐ అధికారులు బ్యాంక్ బోర్డు, సీనియర్ మేనేజ్‌మెంట్‌తో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. అయితే, పర్యవేక్షణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో బ్యాంక్ తగిన ప్రయత్నాలు చేయలేదని, డిపాజిటర్ల ప్రయోజనాలను సమర్థవంతంగా కాపాడలేకపోయిందని ఆర్‌బిఐ అభిప్రాయపడింది. ఈ కారణాల వల్లే కఠిన ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చిందని తెలిపింది.

This is a relief for depositors.6/6

డిపాజిటర్లకు ఊరటనిచ్చే అంశం

 

అయితే, డిపాజిటర్లకు ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. అర్హత కలిగిన ఖాతాదారులు డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు డిపాజిట్ బీమా క్లెయిమ్ పొందేందుకు అర్హులని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. ఇది బ్యాంకు విఫలమైనా డిపాజిటర్లకు కనీస ఆర్థిక రక్షణ కల్పించేందుకు ఉపయోగపడుతుంది. బ్యాంకు ఆర్థిక స్థితి మరింత దిగజారకుండా నియంత్రించడమే కాకుండా, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బిఐ స్పష్టం చేసింది. ఆరు నెలల అనంతరం బ్యాంకు పరిస్థితిని సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.