Prabhas Net Worth: రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేదు. బాహుబలి సిరీస్ తో ప్యాన్ ఇండియా కథానాయకుడిగా అతని రేంజ్ లోకల్ లెవల్ నుండి గ్లోబల్ లెవల్ కి పెరిగింది. అంతేకాదు వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆస్తులకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
1/6Prabhas Net Worth: దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ ‘ఈశ్వర్’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆయన ఎంట్రీ ఇచ్చినపుడు ఇతను మన ఇండియా బిగ్గెస్ట్ స్టార్ అవుతాడని బహుశా ఎవరు గెస్ చేసి ఉండరు. ఒక ఒక్కో చిత్రంతో తన రేంజ్ ను పెంచుకుంటూ వెళ్లాడు ప్రభాస్.
2/6కెరీర్ తొలినాళ్లలో ‘వర్షం’ సినిమాతో తొలి హిట్ అందుకున్న ప్రభాస్.. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఛత్రపతి’ సినిమాతో టాలీవుడ్ లో తిరుగలేని మాస్ హీరోగా సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘బాహుబలి సిరీస్’తో తెలుగు ప్రేక్షకులతో పాటు ప్యాన్ ఇండియా ఆడియన్స్ మనసులను దోచుకున్నాడు. ఈ సినిమాలతో ప్రభాస్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరిగింది.
3/6ఇక బాహుబలి సినిమా తర్వాత కొన్నేళ్లు వరుస ఫ్లాపులతో సతమతమైన ప్రభాస్ ‘సలార్’తో పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. అంతేకాదు మేడమ్ టుస్సాడ్స్ మైనపు మ్యూజియంలో కొలువైన తొలి తెలుగు, దక్షిణాది నటుడు కూడా ప్రభాసే కావడం విశేషం. ఇక లాస్ట్ ఇయర్ ‘కల్కి 2898 AD’ మూవీతో మరోసారి భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్లు కొల్లగొట్టాడు. దక్షిణాది సినీ ఇండస్ట్రీ నుంచి రెండు చిత్రాలతో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు.
4/6ఆ సంగతి పక్కన పెడితే.. ప్రభాస్ ది స్వతహాగా రాజుల ఫ్యామిలీ. ప్రభాస్ కు వారసత్వంగా వందల కోట్లు ఆస్తులున్నాయి. ప్రెజెండ్ డే ఈయన ఆస్తుల విలువ దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉంటుందనేది ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. ఇక సినిమాల నుంచి పర్సనల్ గా ప్రభాస్ కు రూ.350 కోట్ల వరకు సంపాదించినట్టు సమాచారం.
5/6అంతేకాదు ప్రభాస్ కు కుటుంబ వారసత్వంగా వందల ఎకరాల ఫామ్ ల్యాండ్ ఉంది. అంతేకాదు పలు గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్న సమాచారం. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ముంబై, పూణేతో లాంటి మహా నగరాల్లో కొన్ని ఫామ్ హౌసెస్ ఉన్నాయట. అటు విదేశాల్లో లండన్, అమెరికాల్లో సొంత ఇల్లున్నాయి.
6/6రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు, ల్యాండ్ రోవర్, లాంబోర్గిని అవెంటేడర్ రోడస్టర్ కారు, రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి. ఇప్పటికే వేల కోట్ల ఆస్తులు ఉన్న ప్రభాస్ యేడాదికి రూ. 250 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. ఈ యేడాది ‘కన్నప్ప’లో అతిథి పాత్రలో మెరిసిన ప్రభాస్.. వచ్చే యేడాది సంక్రాంతికి ‘ది రాజాసాబ్ ’సినిమాతో పలకరించబోతున్నారు.వీటితోపాటు ‘ఫౌజీ’ చిత్రంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, సలార్ 2, కల్కి 2 మూవీలు లైన్లో ఉన్నాయి.