Add Zee Business As A Preferred Source
App

Red Alert: హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచి దంచికొడుతున్న వర్షాలు.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ..!

Written ByRenuka Godugu
Published: Aug 19, 2025, 07:39 AM IST|Updated: Aug 19, 2025, 07:39 AM IST

Heavy Rains Red Alert: ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అయితే ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రెడ్‌, ఎల్లో అలెర్ట్‌ కూడా జారీ చేశారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
 

Heavy Rains In Telugu States1/8

 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో స్కూళ్లకు కూడా సెలవు ఇచ్చారు. పలు ప్రాంతాల్లో రెడ్‌ అలెర్ట్‌ కూడా జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.  

APSDMA2/8

ఏపీఎస్ డీఎంఏ

 మహబూబాబాద్, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతిబరీ వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు ఏపీలోనూ అల్లూరీ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలకు ఇస్తాయని APSDMA కూడా తెలిపింది.  

Hyderabad Rains3/8

హైదరాబాద్‌ వర్షాలు

 అయితే హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి వర్షం దంచి కొడుతుంది. నిన్న రాత్రి 10 గంటలకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అర్ధరాత్రి కొంత తగ్గిన తెల్లవారుజాము నుంచి మళ్లీ దానికి తీవ్రత పెరిగింది. రోడ్లపై భారీ నీరు నిలిచిపోయాయి..  

Yellow Alert4/8

ఎల్లో అలర్ట్

 ఇదిలా ఉండగా ఈరోజు నగరవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు కూడా ప్రకటించేశారు.   

AP School Holidays5/8

ఏపీ స్కూళ్లకు సెలవులు

 ఈరోజు ఏపీలోని పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటించేశారు. మండల తెలంగాణలోని కామారెడ్డి, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో స్కూళ్లకు సెలవు ఇచ్చారు. ఇది మద్దూరు, డోంగ్లి మండలాలకు కూడా సెలవు ప్రకటించారు.  

School holidays6/8

స్కూళ్లకు సెలవు

 కాగా ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలను హైలెట్ చేశారు. అవసరమైతేనే వర్షం నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు.   

Flood7/8

వరద

 అయితే భారీ వర్షం నేపథ్యంలో వరద తీవ్రంగా రావడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 3.25 లక్షల క్యూసెక్కులు ఉండగా అది 5 లక్షల క్యూసెక్కుల వరకు చేరే ఛాన్స్ ఉందన్నారు.  

Heavy Rains8/8

భారీ వర్షాలు

 ఇక ప్రధానంగా నది పరీవాహక ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు. ఇక కర్ణాటకలో కూడా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ నది ప్రవాహం మరింత పెరుగుతోంది.