Red Idly: ఎంతో రుచికరమైన ఎర్ర ఇడ్లీ…ఆరోగ్యానికి మహా ఔషధం..

Red Ragi Idly : ప్రతి ఒక్కరి ఇంట్లో ఉదయం అయితే చాలు ఇడ్లీ ఉండాల్సిందే. మరి అలాంటి ఇడ్లీ ఎంతో రుచిగా అలానే ఆరోగ్యకరంగా చేసుకోగలిగితే.. ఇంకా సూపర్ కదా. మరి ఆరోగ్యంగానే కాదు ఎంతో రుచికరమైన.. ఎర్ర ఇడ్లీ చేసుకునే విధానం ఏమిటి అనేది ఒకసారి చూద్దాం..
 

1 /5

రోజు మామూలు బియ్యప్పిండి ఇడ్లీ తిని మీకు బోర్ కొట్టి ఉంటే.. అలానే బరువు తగ్గాలి అని మీరు అనుకుంటూ ఉంటే.. సింపుల్ గా ఈ ఎర్రటి రాగి ఇడ్లిని ట్రై చేయండి. 

2 /5

ఇప్పుడు బియ్యం రెండు కప్పులు  ఉద్దిపప్పు రెండు కప్పులు  క్యారెట్ తురుము  రాగి పిండి రెండు కప్పులు..  

3 /5

ముందుగా బియ్యం అలానే ఉద్దిపప్పు రాత్రి మొత్తం నానబెట్టుకొని ఉదయాన్నే మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు కలుపుతూ రాగి పిండి గద్దలు కట్టకుండా కలుపుకోవాలి. 

4 /5

చివరిగా ఇందులో క్యారెట్ తురుము వేసుకొని ఇడ్లీ పిండిలా కలుపుకొని.. ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు పెట్టుకోవాలి.   

5 /5

15 నిమిషాల పాటు ఉడకనిచ్చి ఆ తర్వాత దించి ఒక పది నిమిషాల తర్వాత ప్లేట్లో వేసుకుంటే ఎంతో రుచికరమైన ఎర్రటి రాగి ఇడ్లీ రెడీగా ఉంటుంది.