Renu Desai Strong Warning: రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఇచ్చి పడేశారు. తన జీవితంపై ఎవరు ఏమనుకున్నా తనకు భయం లేదంటూ తెగేసి చెప్పారు. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
1/5రేణు దేశాయ్.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తనకు వచ్చే కామెంట్స్‌పై, సోషల్ ఇష్యూస్‌పై స్ట్రాంగ్‌గా మాట్లాడతారు. గతంలో పవన్ కళ్యాణ్‌ని పెళ్లి చేసుకుని.. కొంత కాలానికి విడాకులు తీసుకున్నారు. అయితే డివొర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకున్నారు.. కానీ రేణు ఒంటరిగానే ఉంటూ తన పిల్లల చదువులు చూసుకుంటున్నారు.
2/5ఇక గతంలో రేణు రెండో పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. అయితే, ఆ సమయంలో కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెను సోషల్ మీడియాలో విమర్శించారు. రెండో పెళ్లి చేసుకోవడం నీకు సరికాదని కామెంట్లు చేశారు. దీనిపై రేణు తీవ్రంగా స్పందించారు. ఇది నా జీవితం, నా ఇష్టం ప్రకారం జీవించే హక్కు నాకు ఉందని, ఎవరి జోక్యం అవసరం లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఈ విషయం మళ్లీ పెద్దగా చర్చకు రాలేదు.
3/5ఇటీవల మరో పవన్ ఫ్యాన్ రేణు దేశాయ్‌కి కోపం తెప్పించేలా కామెంట్ చేశాడు. మిమ్మల్నీ ఇప్పటికీ మా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ భార్యగానే చూస్తున్నామని.. మీ జీవితంలో వేరే వాళ్లను ఊహించలేకపోతున్నామని తెలిపాడు. దీనికి రేణు దేశాయ్ చాలా సీరియస్‌గా సమాధానం ఇచ్చారు.
4/5ఈ రోజుల్లో కూడా స్త్రీలను భర్త లేదా తండ్రి ఆధీనంలోనే చూసే మనస్తత్వం సమాజంలో ఉందని, ఇది పితృస్వామ్యం వల్లేనని అన్నారు. స్త్రీలు చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని రేణు ఆవేదన వ్యక్తం చేశారు.
5/5మరికొందరైతే స్త్రీలను వంట చేయడం, పిల్లలు కనడం కోసం మాత్రమే అన్నట్టూ చూస్తారని రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ ఆలోచనలకు తాను వ్యతిరేకమని, ఎవరు ఏమనుకున్నా భయపడనని, భవిష్యత్ తరాల మహిళల కోసం మార్పు తీసుకురావడమే తన లక్ష్యమని రేణు చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా మంది రేణు దేశాయ్‌కి సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు.