Retirement age of Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

Retirement age Increase of Govt Employees: డీఏ పెంపు తర్వాత కేంద్ర ప్రభుత్వం మరో ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి పెంపుపై కీలక నిర్ణయం తీసుకోబోతున్ట్టు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పని కాలాన్ని పొడిగించాలనే నిర్ణయం రెండు ప్రయోజనాలను నెరవేరనుంది. వివిధ రంగాలకు తమ నైపుణ్యాన్ని అందించగల అనుభవజ్ఞులైన, పరిజ్ఞానం ఉన్న సిబ్బందిని నిలుపుకోవడం ఇందులో ముఖ్యమైనది. 

1 /5

Retirement age Increase of Govt Employees: ప్రభుత్వ రంగంలో పదవీ విరమణ వయస్సులో మార్పులపై జరుగుతున్న చర్చల మధ్య, ప్రభుత్వం ఇప్పుడు ఓ క్లారిటీ ఇచ్చింది. చాలా మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 యేళ్లు. బోధన, శాస్త్రీయ పరిశోధన వంటి కొన్ని రంగాలలో, దీనిని ప్రభుత్వం 65 సంవత్సరాలకు పొడిగించారు. రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్వంత పదవీ విరమణ విధానాలున్నాయి. 

2 /5

ప్రభుత్వ ఉద్యోగుల పని వయస్సును పొడిగించాలనే నిర్ణయం రెండు ప్రయోజనాలను అందించబోతుంది.  వివిధ రంగాలకు తమ నైపుణ్యాన్ని అందించగల అనుభవజ్ఞులైన, పరిజ్ఞానం గల సిబ్బందిని నిలుపుకోవడంతో  ఇది సహాయపడుతుంది.వృద్ధ జనాభాతో పాటు తగ్గిపోతున్న శ్రామిక శక్తి కారణంగా పెన్షన్ పథకాలపై ఆర్థిక ఒత్తిడిని కూడా కొంత మేర తగ్గించే అవకాశం ఉంది. 

3 /5

ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా ప్రయోజనం అందుకోనున్నారు. పదవీ విరమణ కోసం ప్రణాళిక వేసుకోవడానికి వారికి ఇప్పుడు అదనంగా ఐదేళ్ల  సమయం ఉంది. పదవీ విరమణ వయస్సు పొడిగింపును కొందరు స్వాగతించగా.. మరికొందరు ఇది ఒక భారంగా భావించారు.

4 /5

65 సంవత్సరాల వయస్సు వరకు పని చేయడం వల్ల వారి పదవీ విరమణ పొదుపులను పెంచుకోవచ్చు. పదవీ విరమణ తర్వాత మరింత సౌకర్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు.దీనిపై కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మార్చే ప్రణాళిక అసలు లేదనన్నారు. 

5 /5

లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల వల్ల ఏర్పడే ఖాళీలను రద్దు చేసే విధానం ప్రభుత్వానికి లేదని సింగ్ అన్నారు.