Add Zee Business As A Preferred Source
App

Revanth Reddy: దసరాకు ముందే GHMC ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఏకంగా రూ.1.25 కోట్ల వరకు.. డిటెయిల్స్..

Written ByInamdar Paresh
Published: Sep 30, 2025, 01:19 PM IST|Updated: Sep 30, 2025, 01:21 PM IST

Ghmc announces Dussehra gift: దసరా పండగ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఉద్యొగులకు భారీ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా కార్మికులు గత కొన్ని రోజులుగా చేస్తున్న డిమాండ్ లు నెరవేరడంతో ఉద్యోగులు పండగ చేసుకుంటున్నారు.
 

Hyderabad:1/6

దసరా పండగ:

దసరా పండగ వేళ సీఎం రేవంత్ రెడ్డి తన దైన శైలీలో శుభవార్తలు చెబుతున్నారు. ఇప్పటికే గ్రూప్ ఉద్యోగాల రిజల్ట్ విడుదల చేసి, అభ్యర్థులకు ఆఫర్ లెటర్ లు కూడా అందజేశారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ సానిటరీ వర్కర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు భారీ శుభవార్త చెప్పింది.

ghmc:2/6

జీహెచ్ఎంసీ దసరా గిఫ్ట్:

రోడ్డుపై తరచుగా పారిశుద్దకార్మికులు తమ పనులు చేస్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఇటీవల గణేష్ నిమజ్జనం తర్వాత ఒక పారిశుద్దకార్మికురాలు రేణుక టస్కర్ వాహనం ఢీకొని చనిపోయి విషయం తెలిసిందే. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో గత కొంత కాలంగా తమకు ఇన్సురెన్స్ పథకం తీసుకొని రావాలని కార్మికులు డిమాండ్ లు చేస్తున్నారు. 

Hyderabad news:3/6

దసరా పండగ:

ఈక్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దసరా పండగ వేళ సారిటీరీ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది.  జీహెచ్ఎంసీలో పని చేస్తున్న కార్మికుల కోసం ప్రమాద బీమా పథకాన్ని తీసుకునివచ్చింది. ఒక్కొక్క కార్మికుడికి .30 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. దీనికోసం జీహెచ్ఎంసీ పంజాబ్ నేషనల్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది.  

ghmc sanitation worker:4/6

హైదరాబాద్:

కార్మికులకు రూ.30 లక్షలు, పర్మినెంట్ ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.1.25 కోట్ల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తూ జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సిబ్బంది రూపాయి ఖర్చు చేసే పని లేదు. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో తరచూ ప్రమాదాలకు గురయ్యే కార్మికులు, ఇతర సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో దీన్ని అమల్లోకి తెచ్చామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.  

cm revanth reddy:5/6

సీఎం రవంత్ రెడ్డి:

సింగరేణి సంస్థ తమ కార్మికులకు అందిస్తున్న బీమా విధానాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ పథకాన్ని రూపొందించారు. దీని ప్రకారం రూ. 25 వేల లోపు వేతనం పొందే వారికి రూ.30 లక్షలు, రూ.25 వేల నుంచి రూ.75 వేల మధ్య జీతం ఉన్నవారికి రూ.50 లక్షలు ప్రమాద బీమా లభిస్తుంది. అలాగే, రూ.75 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు వేతనం ఉన్నవారికి రూ.కోటి, రూ.1.50 లక్షలకు పైగా జీతం అందుకునే వారికి రూ.1.25 కోట్ల బీమా కవరేజీ వర్తిస్తుందని అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.  

Dussehra:6/6

దసరా:

ఒక వేళ  ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే బీమా మొత్తంలో సగం పరిహారంగా అందుతుంది. ఒకవేళ విమాన ప్రమాదంలో మరణిస్తే బీమా మొత్తం రెట్టింపు అవుతుందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో పండుగ వేళ ఉద్యోగుల కుటుంబాల్లో పండగ వాతావరణ నెలకొంది.