Add Zee Business As A Preferred Source
App

Pant vs Kohli: కోహ్లీని అవమానించిన రిషబ్‌ పంత్‌.. నెట్టింట రచ్చ ఏం జరిగిందో తెలుసా?

Published: Oct 30, 2025, 08:23 PM IST|Updated: Oct 30, 2025, 08:27 PM IST

Rishabh Pant Dishonoured To Virat Kohli: భారత యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ చేసిన ఒక పని తీవ్ర దుమారం రేపుతోంది. స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీని అవమానించాడని నెట్టింట తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ జెర్సీ ధరించాడని బీసీసీఐతోపాటు పంత్‌పై అభిమానులు చెలరేగిపోతున్నారు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

1/6

భారత క్రికెట్‌లో స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ. మూడు ఫార్మాట్‌లలో అద్భుతంగా ఆడి దేశానికి ఎంతో ఘన కీర్తి అందించాడు. అలాంటి కోహ్లీని యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ అవమానించాడని నెట్టింట తీవ్ర దుమారం రేగుతోంది. పంత్‌పై కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

2/6

దక్షిణాఫ్రికా -ఏ తో అనధికారిక టెస్టు సిరీస్‌ సందర్భంగా రిషబ్‌ పంత్‌ భారత్‌ -ఏ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు జట్ల మధ్య బెంగళూరు వేదికగా గురువారం తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్టు మ్యాచ్‌లో పంత్‌ ధరించిన జెర్సీపై దుమారం రేగింది. అతడు వేసుకున్న జెర్సీ నంబర్‌ 18 విరాట్‌ కోహ్లీకి సంబంధించినది.

3/6

ప్రస్తుతం విరాట్‌ కోహ్లి టెస్టు క్రికెట్‌ నుంచి వైదొలిగినా అతడి జెర్సీ నంబర్‌ ఇతరులకు కేటాయించడం తప్పు అని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీమిండియా తరఫున మొత్తం 123 టెస్టులు ఆడిన కోహ్లి 9,230 పరుగులు సాధించాడు. వీటిలో 30 సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు టెస్టు క్రికెట్‌కు కోహ్లీ రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

4/6

టెస్టు క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన విరాట్‌ కోహ్లీని అవమానించినట్టుగా పంత్‌కు జెర్సీ నంబర్‌ 18 ఇచ్చారు. ఇది ముమ్మాటికీ కోహ్లీని అవమానించేందుకు ఇలా చేశారని కోహ్లీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పంత్‌ 18 నంబర్‌ జెర్సీ ధరించడం కోహ్లి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. 

5/6

ఉద్దేశపూర్వకంగా రిషబ్‌ పంత్‌ 18వ నంబర్‌ జెర్సీ ధరించాడా? లేక ప్రధాన ‌కోచ్‌ గౌతం గంభీర్‌ దృష్టిలో పడడం కోసం ఇలా చేశాడా? అని కోహ్లీ అభిమానులు నెట్టింట పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు. దీంతో పంత్‌ వర్సెస్‌ కోహ్లీగా పరిస్థితి మారింది.

6/6

టెస్టు క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన కోహ్లీకి సంబంధించిన జెర్సీ నంబర్‌ 18 ఎవరికీ కేటాయించకుండా గౌరవంగా చూడాల్సి ఉండగా.. ఇలా పంత్‌కు ఇవ్వడాన్ని బీసీసీఐ తీరుపై మండిపడుతున్నారు. నెట్టింట తీవ్ర దుమారం రేపడంతో బీసీసీఐ వర్గాలు స్పందించారు. 'భారత్‌- ఎ జట్టులో జెర్సీ నంబర్లు ప్రత్యేకంగా ఎవరికీ కేటాయించరు. వాటిపై పేర్లు కూడా ఉండవు. మ్యాచ్‌కు ముందు వచ్చిన జెర్సీలను ఆటగాళ్లు ధరించారు. తప్ప భారత్‌ ఏలో జెర్సీ నంబర్లకు ఎలాంటి ప్రాధాన్యం ఉండదు’ అని వివరణ ఇచ్చారు.