Rohit Sharma: కోచ్ గౌతమ్ గంభీర్‌కు షాకిచ్చిన రోహిత్ శర్మ.. హిట్‌మ్యాన్ దెబ్బ అదుర్స్ కదూ..!

Rohit Sharma Vs Gautam Gambhir: హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో విభేదాలను హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పరోక్షంగా బయటపెట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజయం వెనుక మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కృషి ఉందంటూ రోహిత్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆ ట్రోఫీ గెలిచినప్పుడు కోచ్‌గా గంభీర్ ఉన్నా.. క్రెడిట్ మాత్రం ద్రావిడ్‌కు ఇచ్చాడు హిట్‌మ్యాన్. 
 

1 /6

సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డుల ప్రదానోత్సవంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడానికి చాలా సార్లు తాము దగ్గరగా వచ్చామని.. కానీ ఫైనల్ సరిహద్దును దాటలేకపోయామన్నారు. తాము ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా నిలవడంలో రాహుల్‌ ద్రావిడ్‌ ఒకప్పుడు రచించిన ప్రణాళికలను అనుసరించడం కారణమైందని వెల్లడించాడు.   

2 /6

టీమిండియా టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో టీమ్‌గా కొన్నేళ్ల నుంచి చేసిన కృషి ఉందని.. ఒకటి రెండేళ్లలో సాధ్యం కాలేదన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సమయంలో గంభీర్ కోచ్‌గా ఉన్నా.. రోహిత్ ఆయన పేరును ప్రస్తావించకుండా ద్రావిడ్‌కే క్రెడిట్ ఇచ్చాడు.   

3 /6

వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో ఆసీస్‌ చేతిలో ఓటమి తరువాత చివరి మెట్టుపై బోల్తా పడకుండా టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచామని హిట్‌మ్యాన్ గుర్తు చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ కోసం తాను, రాహుల్ ద్రావిడ్ రచించిన ప్రణాళికలను ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అనుసరించామన్నారు.   

4 /6

టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం హెడ్ కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకున్నారు. ఆ తరువాత గౌతమ్ గంభీర్ కోచ్‌గా వచ్చాడు. దీంతో అప్పటి నుంచి రోహిత్ ప్రాధాన్యం టీమ్‌లో తగ్గిపోయింది.  

5 /6

టీ20 వరల్డ్ కప్ అనంతరం పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన హిట్‌మ్యాన్.. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ అనంతరం టెస్టులకు కూడా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. గంభీర్‌తో విభేదాల కారణంగానే రోహిత్, విరాట్ టెస్టులకు గుడ్ బై చెప్పారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో గంభీర్ పేరు ప్రస్తావించకుండా రోహిత్ మాట్లాడడం చర్చగా మారింది. హిట్‌మ్యాన్ చెప్పినదాంట్లో తప్పేమి లేదంటూ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు.   

6 /6

ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి శుభ్‌మన్ గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడం కూడా దుమారం రేపుతోంది. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలనే పట్టుదలతో ఉన్న హిట్‌మ్యాన్.. ఇటీవల పది కేజీల బరువు తగ్గి పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు.