Add Zee Business As A Preferred Source
App

Rohit Sharma: 10 కిలోల బరువు తగ్గిన రోహిత్ శర్మ.. హిట్‌మ్యాన్ వెయిట్ లాస్ సీక్రెట్స్ ఇవే..!

Published: Sep 26, 2025, 05:22 PM IST|Updated: Sep 26, 2025, 05:22 PM IST

Rohit Sharma Weight Loss Journey: ఎలాగైనా 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలనే సంకల్పంతో ఉన్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఫిట్‌నెస్ మీద పూర్తి దృష్టి పెట్టాడు. టెస్టులకు, టీ20లకు ఇప్పటికే గుడ్ బై చెప్పిన రోహిత్.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసినప్పటి నుంచి హిట్ మ్యాన్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. ఇటీవల రోహిత్ శర్మ 10 కేజీల బరువు తగ్గాడు. 

Rohit Sharma Weight Loss Journey1/7

భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్న రోహిత్ శర్మ..  తాను 10 కేజీల బరువు తగ్గినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన పిక్ ను హిట్ మ్యాన్ షేర్ చేసుకున్నాడు.

Rohit Sharma2/7

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు రోహిత్ శర్మ బరువు తగ్గిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో హిట్ మ్యాన్ బరువు ఎలా తగ్గాడని ఫ్యాన్స్‌తోపాటు నెటిజన్లు ఆసక్తిగా వెతుకున్నారు. ఎలా వెయిట్ లాస్ అయ్యాడో ఇక్కడ తెలుసుకుందాం..

Rohit Sharma News3/7

భారత జట్టు సహాయక సిబ్బంది సూచించినట్లుగా.. రోహిత్ శర్మ  గత ఐదు నెలలుగా చేపట్టిన కఠినమైన, శాస్త్రీయంగా అభివృద్ధి చేసిన  ఫిట్‌నెస్ ప్రోగామ్ కారణంగా బరువు తగ్గాడు. 

Rohit Sharma Records4/7

ఆహారం విషయానికి వస్తే.. అధిక ప్రోటీన్, తక్కువ కార్బ్ తీసుకుంటున్నాడు.  కొవ్వు కరిగిపోయోలా.. కండరాలు బలంగా తయ్యారేలా కండిషనింగ్ సెషన్లు ఏర్పాటు చేసుకున్నాడు.

Rohit Sharma Age5/7

మ్యాచ్ పరిస్థితులు, హై ప్రెజర్‌ను తట్టుకుని నిలబడే విధంగా యోగా చేస్తాడు. నిత్యం స్విమ్మింగ్ చేస్తాడు. ప్రత్యేకంగా బ్యాటింగ్ ఫిట్‌నెస్ వ్యాయామాలు కూడా చేస్తాడు.

Rohit Sharma weight loss6/7

ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 38 సంవత్సరాలు. ప్రస్తుతం వన్డే టీమ్‌లో అందరి కంటే హిట్ మ్యాన్ సీనియర్. 2027 వరల్డ్ కప్ నాటికి 40 ఏళ్లకు చేరుకుంటాడు. అప్పటివరకు కెరీర్ కొనసాగించేందుకు రోహిత్ ఫిట్‌నెస్ మీద ఫోకస్ పెట్టాడు.  

rohit sharma weight loss news7/7

ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. వన్డే ర్యాంకింగ్స్ లో హిట్ మ్యాన్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. మొదటి స్థానంలో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొనసాగుతున్నాడు.