Rohit Sharma Net Worth And Assets: భారత క్రికెట్ జట్టులో అత్యంత విలువైన ఆటగాడు రోహిత్ శర్మ. హిట్‌మ్యాన్‌గా పేరొందిన రోహిత్ శర్మ విజయవంతమైన ఆటగాడిగా.. కెప్టెన్‌గా రాణించారు. క్రికెట్‌లో విశేషంగా రాణించి ప్రస్తుతం రిటైర్మెంట్‌కు దగ్గరైన రోహిత్ శర్మ ఆస్తులు ఎన్నో తెలుసుకుందాం.
1/6రిటైర్మెంట్‌కు చేరువైన రోహిత్ శర్మ భారత వన్డే జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. అభిమానులు హిట్‌మ్యాన్‌గా పిలిచే రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 18 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. 2007లో భారతదేశానికి నాయకత్వం వహించినప్పటి నుంచి అతడు అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో ఒకడు.
2/62007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ తన సొగసైన బ్యాటింగ్‌తో టెస్టు క్రికెట్‌లో రాణించాడు. అనంతరం ఐపీఎల్‌లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ డెక్కన్ ఛార్జర్స్ జట్టులో అడుగుపెట్టి అనంతరం ముంబై ఇండియన్స్‌లో కొనసాగుతున్నాడు.
3/6బీసీసీఐ ఒప్పందం ప్రకారం రోహిత్ శర్మ గ్రేడ్ ఏ+ ఆటగాడు. అతడు మ్యాచ్ ఫీజు దాదాపు రూ.7 కోట్లు పొందుతున్నాడు. దేశంలో అత్యధిక పారితోషికం పొందే క్రికెటర్లలో ఒకరిగా హిట్‌మ్యాన్ ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున సీజన్‌కు రూ.16.3 కోట్లు సంపాదిస్తున్నాడు. అతడి మొత్తం ఐపీఎల్ సంపాదన రూ.190 కోట్లు దాటింది.
4/6క్రికెట్‌పరంగా కాకుండా వివిధ బ్రాండ్‌లకు వాణిజ్య ప్రకటనలు చేస్తుంటారు. రోహిత్ క్రీడా దుస్తుల నుంచి లగ్జరీ గడియారాల వరకు వివిధ రకాల బ్రాండ్లకు అంబాసిడర్‌గా చేస్తున్నాడు. అతడి ప్రచార ఆదాయం సంవత్సరానికి రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు ఉండవచ్చు.
5/6హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మొత్తం ఆస్తుల నికర విలువ రూ.215 కోట్ల నుంచి రూ.230 కోట్లు ఉంటుందని అంచనా. ఇక ముంబైలో రోహిత్‌కు లగ్జరీ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇక అతడి గ్యారేజ్‌లో లంబోర్గిని, మెర్సిడెస్ వంటి హై-ఎండ్ కార్లు కలిగి ఉన్నాడు.
6/6ఇక వ్యాపారపరంగా చూస్తే రోహిత్ శర్మ క్రికెట్‌తోపాటు కొన్ని స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడుల ద్వారా భారీగా ఆస్తులు కూడా బెట్టాడు. రోహిత్ శర్మ క్రికెట్‌లందరిలోనూ భారీగా ఆస్తులు కలిగి ఉన్నాడు.