Add Zee Business As A Preferred Source
App

Soft Fluffy Chapati : చపాతీలు ఎంతో మృదువుగా.. పూరీలల పొంగేలా రావాలంటే.. ఇలా చెయ్యడం తప్పనిసరి..!

Written ByVishnupriya
Published: Oct 08, 2025, 06:04 PM IST|Updated: Oct 08, 2025, 06:06 PM IST

Hotel Style Soft Chapati 
భారతీయ వంటల్లో రోటీ లేదా చపాతీకి..ప్రత్యేక స్థానం ఉంది. చాలా మంది ప్రతిరోజూ రోటీలు తింటారు. కానీ తరచూ అవి గట్టిగా లేదా ఎండిపోయినట్లుగా అయిపోటూ.. ఉండడంతో చాలామందికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. దీని వల్ల ఇంట్లో వండే.. మహిళలు ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇప్పుడు చెప్పబోయే చిన్ని టిప్స్ ఫాలో అవ్వండి. 

Choose Quality Flour 1/5

మంచి పిండి ఎంచుకోండి

రోటీల మృదుత్వం పిండిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి శుద్ధమైన, మంచి నాణ్యత.. కలిగిన గోధుమపిండి ఎంచుకోవాలి.

Mix Some Oil in Dough 2/5

పిండిలో కొద్దిగా నూనె వేయండి

పిండి మలుపు సమయంలో కొద్దిగా నూనె వేస్తే..పిండి మృదువుగా అవుతుంది. దీని వల్ల రోటీలు ఎక్కువసేపు నెమ్మదిగా ఉంటాయి.

Use Only Warm Water 3/5

గోరువెచ్చని నీరు వాడండి

పిండిని కలిపేటప్పుడు ఎప్పుడూ చల్లని నీరు కాకుండా గోరువెచ్చని నీరు వాడాలి. చల్లని నీరు వాడితే పిండి గట్టిగా మారుతుంది. గోరువెచ్చని నీరు రోటీని సాఫ్ట్‌గా ఉంచుతుంది.

Mix Dough Thoroughly 4/5

సరిగ్గా పిండి కలపండి

ఒకేసారి ఎక్కువ నీరు పోయకుండా, కొంచెం కొంచెంగా నీరు వేసి చేతులతో బాగా కలపాలి. ఇలా చేస్తే పిండి మృదువుగా, సులభంగా బెల్లించడానికి పనికివస్తుంది.

Rest The Dough5/5

పిండికి విశ్రాంతి ఇవ్వండి

పిండిని కలిపాక దానిని కాటన్ గుడ్డతో కప్పి కొంతసేపు పక్కన పెట్టాలి. ఇలా చేస్తే పిండి బాగా సెటవుతుంది. తర్వాత బెల్లిస్తే రోటీలు మరింత మృదువుగా వస్తాయి. ఈ టిప్స్ పాటిస్తే మీ రోటీలు హోటల్-స్టైల్‌గా, రుచిగా వస్తాయి. ఇవి కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.