Rrb Group D Exam Date: రైల్వే అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. రైల్వేలో గ్రూప్-D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో ఎగ్జామ్స్ జరగనున్నాయి.
1/5రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 32,438 గ్రూప్-D పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల కోసం పరీక్షలు నవంబర్ 17 నుంచి డిసెంబర్ చివరి వరకు ఆన్‌లైన్‌లో జరుగనున్నాయి. అభ్యర్థులు పరీక్ష కేంద్రం, తేదీ వంటి వివరాలను 10 రోజుల ముందు తెలుసుకోవచ్చు. తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు చూడాలి.
2/5ఈ నియామకం కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్షతో ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత శారీరక సామర్థ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ఉంటాయి.
3/5పరీక్షలో 100 బహుళ ఎంపిక ప్రశ్నలు ఉంటాయి. వీటిలో గణితం, రీజనింగ్, సాధారణ విజ్ఞానం, సమకాలీన అంశాలు, సాధారణ సైన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
4/5పరీక్ష సమయం 90 నిమిషాలు. అంగ వైకల్యం ఉన్నవారికి 120 నిమిషాలు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులు తగ్గిస్తారు.
5/5వివిధ విభాగాల్లో మెయింటెయినర్, పాయింట్స్‌మన్, లోకో షెడ్, ఆపరేషన్స్, ఎయిర్-కండిషనింగ్ వంటి పోస్టులు ఉన్నాయి. అడ్మిట్ కార్డులు, పరీక్ష కేంద్ర వివరాలు పరీక్షకు కొన్ని రోజుల ముందు అందుబాటులో ఉంటాయి.