Add Zee Business As A Preferred Source
App

RRB Exam Date: RRB అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. పరీక్ష షెడ్యూల్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!

Written ByAruna Maharaju
Published: Sep 21, 2025, 04:41 PM IST|Updated: Sep 21, 2025, 04:41 PM IST

Cbt Ii Exam Date Out: నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) గ్రాడ్యుయేట్ లెవల్ సెకండ్ ఎగ్జామ్ డేట్ షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసింది. అక్టోబర్ 13, 2025న CBT-II ఎగ్జామ్ జరుగనుంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ని చెక్ చేసుకోవచ్చు. 
 

1/5

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌లో జరగనున్న నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) గ్రాడ్యుయేట్ లెవల్ సెకండ్ ఎగ్జామ్ డేట్ షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) రిలీజ్ చేసింది. CBT-II పరీక్ష అక్టోబర్ 13, 2025న జరుగుతుంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్ rrbcd.gov.inలో పూర్తి నోటిఫికేషన్‌ను చెక్ చేయొచ్చు.

RRB NTPC గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్2/5

RRB NTPC గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్

RRB NTPC గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్, CBT-II పరీక్ష షెడ్యూల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి.. అధికారిక వెబ్ సైట్ rrbcd.gov.in కి వెళ్లాలి. మొదట హోమ్ పేజీలో RRB NTPC CBT-II Tentative Schedule 2025 పై క్లిక్ చేయాలి. ఆటోమేటిక్‌గా ఎగ్జామ్ షెడ్యూల్ డౌన్‌లోడ్ అవుతుంది. తదుపరి రెఫరెన్స్ కోసం సేవ్ చేసుకోవాలి.

3/5

ఎగ్జామ్ సెంటర్ తదితర వివరాలను పరీక్షకు 10 రోజుల ముందు అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతామని బోర్డు తన అధికారిక నోటీసులో తెలిపింది. అభ్యర్థులు అప్ డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి వివరాలను తనిఖీ చేయగలరు.

4/5

పరీక్షకు 4 రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో కాల్ లెటర్/ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ ఆధార్ కార్డును పరీక్షా కేంద్రానికి తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఎందుకంటే అది లేకుండా వారిని లోపలికి అనుమతించరు.

5/5

వివిధ జోన్లలో మొత్తం 11,558 ఉద్యోగాల భర్తీకి ఆర్ ఆర్ బీ నోటిఫికేషన్​ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్, టైపిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి.