Rukhmini Vasanth Remunation for Kantara Chapter 1: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘కాంతార ఛాప్టర్ 1’. విజయ దశమి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాదు ఈ సినిమా తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 89 కోట్ల గ్రాస్ వసూల్లతో సంచలనం రేపింది. ఇక ఈ సినిమాలో కథానాయికగా నటించిన ‘రుక్మిణి వసంత్’ తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
1/7Rukhmini Vasanth Remunation for Kantara Chapter 1: ‘కాంతార’ మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్ 1’ మూవీ ప్రీమియర్స్ తో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అంతేకాదు కన్నడతో పాటు హిందీలో కూడా తొలిరోజు మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక ఈ సినిమాలో యువరాణి కనకవతి పాత్రలో ఒదిగిపోయిన తీరు అందరిని అట్రాక్ట్ చేసింది.
2/7‘కాంతార ఛాప్టర్ 1’లో అజనీష్ లోకనాథ్ రీ రికార్డింగ్.. ఫోటోగ్రఫీ, రిషబ్ దర్శకత్వ ప్రతిభ ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసింది. ఇక హీరోగా ఉంటూ దర్శకుడిగా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన వ్యక్తి రిషబ్ శెట్టి రికార్డులకు ఎక్కాడు. ఇక ఈ చిత్రంలో కథానాయికగా నటించిన రుక్మిణి వసంత్ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
3/7అంతేకాదు ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో హీరోగా పోటీపడుతూ నటించిన రుక్మిణి నటనకు అందరు మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా విజయంతో ‘కాంతార ఛాప్టర్ 1’ కోసం రుక్మిణి వసంత్ తీసుకున్న పారితోషికం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
4/7‘కాంతార ఛాప్టర్ 1’ సినిమా కోసం రుక్మిణి వసంత్ దాదాపు రూ. కోటి పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. కన్నడ సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ కు ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇవ్వడం అనేది హాట్ టాపిక్ గా మారింది. ‘కాంతార’ తో ఈ కాంత సినీ జీవితం కొత్త టర్న్ తీసుకోవడం పక్కా అని చెప్పొచ్చు. ఈ చిత్రం తర్వాత టాప్ హీరోయిన్ లీగ్ లోకి వెళ్లడం పక్కా అని చెప్పొచ్చు.
5/7‘కాంతార ఛాప్టర్ 1’ కోసం రిషబ్ శెట్టి నటుడిగా దర్శకుడిగా.. సంభాషణల రచయతగా ఒక్క రూపాయికి కూడా పారితోషికం తీసుకోలేదట. అంతేకాదు సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంటూ లాభాల్లో వాటా తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నాడట. మొత్తంగా పెద్ద రిస్క్ చేసి ఈ సినిమాను తెరకెక్కించాడు.
6/7‘కాంతార ఛాప్టర్ 1’ కేజీఎఫ్ 2 తర్వాత రూ. 125 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కన్నడ సినీ ఇండస్ట్రీ అతిపెద్ద బడ్జెట్ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచిపోనుంది. ఇక గతంలో ‘కాంతార’ చిత్రాన్ని కేవలం రూ. 15 కోట్లతో తెరకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సారి ప్రీక్వెల్ కోసం భారీగా ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు.
7/7గత కాంతార చిత్రాన్ని కేవలం రూ.15-20 కోట్లతో నిర్మించి రూ.400 కోట్లకు పైగా వసూలు చేయడంతో, ఈసారి అంచనాలు మరింత పెరిగాయి. ఈసారి నటీనటుల పారితోషికం, బడ్జెట్ మరియు కథ అన్నీ పెద్ద స్థాయిలో ఉన్నాయి.