Add Zee Business As A Preferred Source
App

Top Heroine: తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైన స్టార్ నటుడితో ఓ టాప్ హీరోయిన్ పీకల్లోతూ ప్రేమాయణం.. ఎవరో తెలుసా..?

Written ByAruna Maharaju
Published: Sep 12, 2025, 06:40 PM IST|Updated: Sep 12, 2025, 06:40 PM IST

Heroine Rekha and Hero Akshay Kumar’s Relationship: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేఖ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. వయసు పెరుగుతున్న రేఖ అందం మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అమితాబచ్చన్‌తో ప్రేమ విఫలం అయ్యాక రేఖ ఓ మూవీ షూటింగ్ టైమ్‌లో.. తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైనా ఓ స్టార్ హీరోని మనసారా ప్రేమించిదనే పుకార్లు బాగా వైరల్ అయ్యాయి. మరి ఆ హీరో ఎవరు..? ఇప్పుడు తెలుసుకుందాం..
 

Hero Akshay Kumar1/5

బాలీవుడ్ హీరోయిన్ రేఖ

రేఖ బాలీవుడ్‌లో ఎప్పుడూ ప్రసిద్ధమైన నటి. తన అందం, నటనతో ఎన్నో సినిమాల్లో మెప్పించింది. రేఖ నటించిన చాలా సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనస్సుల్లో అలానే ఉన్నాయి. ఇక 70 ఏళ్ల వయసులో కూడా రేఖ అందం అలాగే ఉంది. తన సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం వల్ల కూడా ఎన్నోసార్లు వార్తల్లో నిలిచింది రేఖ.   

Hero Akshay Kumar2/5

హీరోయిన్ రేఖ

ఒక సినిమా షూటింగ్ సమయంలో రేఖ తన కంటే 12 సంవత్సరాలు చిన్నవాడైన బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్‌తో ప్రేమలో పడిందని గుసగుసలు వచ్చాయి. ఆ సినిమా పేరు ఖిలాడియోం కా ఖిలాడి. ఈ సినిమాలో రేఖ, అక్షయ్ కలిసి నటించిన రొమాంటిక్ సన్నివేశాలు చాలా గుర్తింపు పొందాయి. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య సన్నిహిత్యం గురించి అపట్లో బాగా రూమర్స్ వచ్చాయి.   

Heroine Rekha3/5

అమితాబచ్చన్ రేఖ లవ్ స్టోరీ

అయితే రేఖ.. అక్షయ్ కోసం ఇంటి నుండి భోజనం వండుకొని షూటింగ్‌కి తీసుకొచ్చేదని.. అతని పట్ల స్పెషల్ ఇంట్రెస్ట్ చూపేదనే విషయం కూడా బయటికి వచ్చింది. కానీ వీరిద్దరూ మాత్రం ఈ విషయంపై ఎప్పుడూ నోరు విప్పలేదు. 

Bollywood Heroine Rekha4/5

అక్షయ్ కుమార్ ని ప్రేమించిన రేఖ

మొదట ఈ సినిమా కోసం డింపుల్ కపాడియాను సంప్రదించగా.. ఈ ఆఫర్‌ని ఆమె ఒప్పుకోలేదు. దీంతో హీరోయిన్ రేఖకి ఈ మూవీలో చేసే ఛాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాలో రేఖ నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా వచ్చింది. 

Rekha Akshay Kumar Affair5/5

అక్షయ్ కుమార్ ని ప్రేమించిన రేఖ

అప్పట్లోనే ఖిలాడియోం కా ఖిలాడి సినిమా ప్రపంచవ్యాప్తంగా 25.15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇది రేఖ, అక్షయ్ కలిసి నటించిన తొలి మరియు చివరి సినిమా. ఆ తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి ఎలాంటి సినిమాలో నటించలేదు.