Add Zee Business As A Preferred Source
App

Sabarimala Darshan: అయ్యప్ప భక్తులారా.. మండల పూజకు వెళ్తున్నారా? టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలంటే?

Written ByHarish Darla
Published: Oct 31, 2025, 08:00 PM IST|Updated: Oct 31, 2025, 08:00 PM IST

Sabarimala Darshan Online Booking: శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల పూజ దర్శనం కోసం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ రేపు అనగా నవంబరు 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో శబరిమల వెళ్లాలనుకునే భక్తులకు దర్శనం టికెట్టు తప్పనిసరి చేశారు. అయితే ఈ దర్శనం టికెట్టు‌ను ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Sabarimala Darshan Tickets Booking1/8

శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల పూజ దర్శనం కోసం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ రేపు అనగా నవంబరు 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో శబరిమల వెళ్లాలనుకునే భక్తులకు దర్శనం టికెట్టు తప్పనిసరి చేశారు. అయితే ఈ దర్శనం టికెట్టు‌ను ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Sabarimala Darshan Tickets2/8

శబరిమల అయ్యప్ప ఆలయం కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఉంది. ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ముఖ్యంగా అయ్యప్ప ఆలయంలో జరిగే వార్షిక మండల పూజ, మకర విలుక్కు పండుగ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.   

Sabarimala Darshan Tickets Online3/8

మండల, మకర విలుక్కు పూజలు డిసెంబర్, జనవరి నెలల్లో జరుగుతాయి. దీని కోసం వివిధ రాష్ట్రాల నుండి భక్తులు అయ్యప్ప మాలలు ధరించి.. 41 రోజుల దీక్షలు నిర్వహించి ఆ తర్వాత వారి ఇరుముడులను అయ్యప్పకు సమర్పించేందుకు భక్తులు లక్షలాదిగా శబరిమల తరలివెళతారు.  

Sabarimala Darshan Booking 20254/8

ఈ మండల పూజ కోసం శబరిమల అయ్యప్ప ఆలయం నవంబర్ 16, 2025న సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనుంది. ఆ తర్వాత డిసెంబరు 27 నాటికి మండల పూజ పూర్తవ్వగానే ఆలయాన్ని మూసేస్తారు. ఆ తర్వాత మకర విలుక్కు పూజ కోసం డిసెంబరు నెలాఖరు లేదా జనవరి మొదటి వారంలో ఆలయాన్ని తిరిగి భక్తులను అనుమతిస్తారు. ఈ క్రమంలో అయ్యప్ప దర్శనార్థం శబరిమల వెళ్లే వారికి ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్టు తప్పనిసరి చేసింది అయ్యప్ప ఆలయ దేవస్వాం బోర్డు. నవంబరు 1 నుంచి టికెట్లు విడుదల చేయనుండగా.. రోజుకు 70 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.

Sabarimala Online Darshan Booking5/8

అదే సమయంలో పంపా నది వద్ద స్పాట్ రిజిస్ట్రేషన్ కోసం కూడా ఏర్పాట్లు చేసింది కేరళ ప్రభుత్వం. రోజుకు 20,000 మంది భక్తులను అక్కడకు అనుమతిస్తామని దేవస్వం బోర్డు తెలిపింది. కాబట్టి, మండల పూజ కోసం అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి మీరు రేపటి (నవంబర్ 1) నుండి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.  

Sabarimala Online Booking6/8

రేపటి నుండి శబరిమల అయ్యప్ప ఆలయం అధికారిక వెబ్‌సైట్.. https://sabarimalaonline.org ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ముందుగా అందులో లాగిన్ అయ్యి.. మీ పేరు, చిరునామా, ఫోటోగ్రాఫ్, పుట్టిన తేదీ మొదలైన వివరాలను ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి.  

Sabarimala Darshan Tickets 20257/8

సమాచారాన్ని ధృవీకరించిన తర్వాత.. పేర్కొన్న నంబర్‌కు OTP వస్తుంది. ఈ-మెయిల్, పాస్‌వర్డ్‌ను మళ్ళీ నమోదు చేసి, దర్శన తేదీని ఎంచుకోండి. ఏదైనా ప్రసాదం అవసరమైతే దానిని ఎంచుకుని, ఆపై రిజర్వేషన్ చేయండి. టికెట్ రిజర్వేషన్ కోసం ఈ-మెయిల్, మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది.  

Sabarimala Temple8/8

మండల పూజ నిర్వహణ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. 10 ప్రాంతాల్లో దాదాపుగా 10 వేల మంది భక్తులు ఒకేసారి విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 27న ఆలయం మూసివేయాల్సి ఉండగా.. మకర విక్రమ పూజతో సమానంగా డిసెంబర్ 30న ఆలయం తిరిగి తెరవనున్నారని దేవస్వాం బోర్డు ప్రకటించింది.