Add Zee Business As A Preferred Source
App

Saddulu 2025: సద్దుల బతుకమ్మపై సందిగ్ధం.. సోమవారమా? మంగళవారమా? ప్రభుత్వ ఆదేశాలు..

Written ByRenuka Godugu
Published: Sep 28, 2025, 01:16 PM IST|Updated: Sep 28, 2025, 01:16 PM IST

Saddula Bathukamma 2025: బతుకమ్మ వేడుకల్లో గందరగోళం ఏర్పడుతోంది. సద్దుల బతుకమ్మ సోమవారం చేసుకోవాలా ? మంగళవారం చేసుకోవాలా? అనే సందిగ్ధంలో మహిళలు ఉన్నారు. పెద్దల అమావాస్య రోజు ప్రారంభమైన బతుకమ్మ పండుగ. రేపు 9వ రోజుతో ముగియనుంది. అయితే సద్దుల బతుకమ్మ ఏ రోజు నిర్వహించాలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం ..
 

Saddula Bathukamma 20251/5

సద్దుల బతుకమ్మ 2025

సద్దుల బతుకమ్మ పండుగ పై సందిగ్ధం ఏర్పడింది. సోమవారం నిర్వహించాలా? లేదా? మంగళవారం నిర్వహించాలనే సందేహంలో ఉన్నారు. మహిళలు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సద్దుల బతుకమ్మ గురించిన క్లారిటీ ఇచ్చింది.   

Peddala Amavasya2/5

పెద్దల అమావాస్య

పెద్దల అమావాస్య రోజు ప్రారంభమైన బతుకమ్మ పండుగ. రేపు 9వ రోజుతో ముగియనుంది. సద్దుల బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 30 మంగళవారం రోజున బతుకమ్మ నిర్వహించాలని దానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.  

Public Holiday3/5

పబ్లిక్ హాలిడే

 మహిళలకు ఎలాంటి ఇబ్బంది అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఆ రోజున పబ్లిక్ హాలిడే కూడా ప్రకటించడంతో ఆ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. అయితే బతుకమ్మ ఏ రోజున జరుపుకోవాలన్న సందిగ్ధంలో చాలామంది ఉన్నారు. కొన్ని చోట్ల సోమవారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.  

Saddula bathukamma4/5

సద్దుల బతుకమ్మ

 సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను తయారు చేస్తారు. కాబట్టి మంగళవారం శుభప్రదం కాదని సోమవారం నిర్వహించుకుంటున్నారు. అయితే బతుకమ్మ వేడుక మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ ,నాలుగో రోజు నానె బియ్యం బతుకమ్మ తయారు చేస్తారు.   

Bathukamma5/5

బతుకమ్మ

 ఇక ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ అని ఆరోజు ఎలాంటి నైవేద్యం పెట్టరు. ఇక ఏడో రోజు వేపకాయల బతుకమ్మ. ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు.