Sai Pallavi Bikini: సంప్రదాయానికి విలువ ఇచ్చే నేటి తరం హీరోయిన్లలో నటి సాయి పల్లవి ఒకరు. ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాల్లో ఏనాడు అసభ్యకరమైన లేదా అభ్యంతరకరమైన డ్రస్సులు లేదా అందాల విందు చేసేందుకు అంగీకరించలేదు. కానీ, ఆమెకు సంబంధించిన ఓ బికినీ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అది నిజమో కాదో ఇప్పుడు తెలుసుకుందాం.
1/6సంప్రదాయానికి విలువ ఇచ్చే నేటి తరం హీరోయిన్లలో నటి సాయి పల్లవి ఒకరు. ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాల్లో ఏనాడు అసభ్యకరమైన లేదా అభ్యంతరకరమైన డ్రస్సులు లేదా అందాల విందు చేసేందుకు అంగీకరించలేదు. కానీ, ఆమెకు సంబంధించిన ఓ బికినీ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అది నిజమో కాదో ఇప్పుడు తెలుసుకుందాం.
2/6ఆమెకు ఇష్టమైన చీరల్లో లేదా ట్రెడిషనల్ డ్రస్సుల్లోనే ఆమె నటిస్తూ వచ్చింది. కనీసం మేకప్ కూడా ఎక్కువ వేసుకోరు. చాలా వరకు ఆమె డౌన్ టూ ఎర్త్ గా ఉంటారు. సంప్రదాయంగా దుస్తులు ధరిస్తారు. అలాంటి హీరోయిన్ సాయి పల్లవికి సంబంధించిన ఓ బికినీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను చూసిన ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
3/6అయితే, చాలా మంది ఫ్యాన్స్ సాయి పల్లవి బికినీ ఫొటోలు AI ద్వారా క్రియేట్ చేశారని ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఫొటో గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.
4/6చీర లుక్స్, కనీస మేకప్‌కు పేరుగాంచిన సాయి పల్లవి, తన కెరీర్ అంతటా బికినీలు వంటి దుస్తులను అస్సలు దగ్గరకు రానివ్వలేదు. కానీ, సడెన్ గా ఆమె స్విమ్ సూట్‌లో కనిపించడంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఇదే విషయమైన సాయి పల్లవిని ట్యాగ్ చేస్తూ నిజమా కాదా అని అడుగుతున్నారు.
5/6వైరల్ చిత్రాన్ని నిశితంగా పరిశీలిస్తే కొన్ని వ్యత్యాసాలు కచ్చితంగా కనిపిస్తున్నాయి. ఆ బికినీ ఫొటో కచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినదే అంటూ పలువురు కామెంట్ చేస్తన్నారు.
6/6ఇలాంటి చర్యలపై సాయిపల్లవి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రూరమైన ఫొటోలను ఎడిట్ చేయడం దారుణం అని.. సదరు నటి పరువుకు భంగం కలిగించడమే అంటూ మండిపడుతున్నారు.