Add Zee Business As A Preferred Source
App

Sai Pallavi vs Keerthy Suresh: సాయి పల్లవి వద్దు... కీర్తి సురేష్ ముద్దు..!

Written ByVishnupriya
Published: Mar 22, 2025, 04:15 PM IST|Updated: Mar 22, 2025, 04:15 PM IST

Sai Pallavi or Keerthy Suresh: సాయి పల్లవి, కీర్తి సురేష్…వీరిద్దరూ కూడా తెలుగులో స్టార్ హీరోయిన్స్. ఒకరి ఎక్కువ, ఒకరు తక్కువ అని చెప్పలేము. అంతేకాదు.. నటనలో కూడా ఇద్దరూ హేమాహేమీలే. అయితే ఇప్పుడు.. వీరిద్దరి మధ్య పోటి రాగా.. అందులో కీర్తి సురేష్ అవకాశం చేజెక్కుంచుకోవడం వార్తగా నిలుస్తుంది.

Sai Pallavi movies1/5

కీర్తి సురేష్, సాయి పల్లవి

సాయి పల్లవి.. కీర్తి సురేష్.. ఇద్దరికీ కూడా తెలుగులో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఫిదా సినిమాతో సాయి పల్లవి తనేమిటో రుజువు చేసుకోగా.. మహానటి చిత్రంతో కీర్తి సురేష్ ఏకంగా నంది అవార్డు తెచ్చుకుంది.   

Keerthy Suresh movies 2/5

కీర్తి సురేష్, సాయి పల్లవి

గ్లామర్ రోల్స్ కాకుండా.. నటన పరంగా.. ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎక్కువగా వీరిద్దరూ చేస్తారు . సాయి పల్లవి పూర్తిగా గ్లామరస్ రోల్స్ కి దూరంగా ఉండగా.. కీర్తి సురేష్ మాత్రం కొన్ని సినిమాలలో గ్లామర్ హీరోయిన్ గా కూడా కనిపించింది.

Sai Pallavi in Ellamma3/5

కీర్తి సురేష్, సాయి పల్లవి

ఈ క్రమంలో ప్రస్తుతం ఒక సినిమా వల్ల వీరిద్దరి పేర్లు తెరపైకే వచ్చాయి. ‘భీష్మ’ తర్వాత నితిన్‌ కెరీర్‌లో పెద్దగా విజయాలు లేకపోవడంతో, ఇప్పుడు ఆయన విజయాన్ని అందుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. 

Keerthy Suresh in Ellamma4/5

కీర్తి సురేష్, సాయి పల్లవి

ఈ క్రమంలోనే బలగం దర్శకుడు వేణుతో నితిన్ ఎల్లమ్మ అనే సినిమా ఒప్పుకున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కి ఎంతో ప్రాధాన్యత ఉంటుందంట. అందుకే ఈ సినిమాలో ఎవరిని హీరోయిన్గా తీసుకోవాలి అన్నదానిపై ఎన్నో చర్చలు జరిగాయి.

Sai Pallavi or Keerthy Suresh 5/5

కీర్తి సురేష్, సాయి పల్లవి

ఈ సినిమా ప్రారంభంలో సాయి పల్లవి పేరు పరిశీలించగా, చివరికి ఆమె డేట్స్‌ అడ్జెస్ట్ చేయలేకపోయారు అని తెలుస్తోంది. దీంతో మరో స్టార్ హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. కీర్తి సురేష్ ఇప్పటికే నితిన్‌తో ‘రంగ్ దే’లో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఈ కాంబినేషన్‌ మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. కాగా మొత్తానికి.. ఎల్లమ్మ సినిమా యూనిట్ సాయి పల్లవి బదులు కీర్తి సురేష్ ని ఫైనలైజ్ చేశారు.