Add Zee Business As A Preferred Source
App

Salary Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది.. భారీగా పెరగనున్న జీతాలు..!

Written ByVishnupriya
Published: Feb 06, 2026, 12:43 PM IST|Updated: Feb 06, 2026, 12:43 PM IST

Salary Hikes 2026: దేశంలోని ఉద్యోగులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. గత కొంతకాలంగా మందగించిన ఉద్యోగ మార్కెట్ ఇప్పుడు మెల్లగా కోలుకుంటోంది. దీని ప్రభావంగా దేశవ్యాప్తంగా జీతాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ నియామక సంస్థ Michael Page India వెల్లడించింది.

Job Salary Home1/5

జాబ్ సాలరీ హైక్

ఈ సంస్థ విడుదల చేసిన ది శాలరీ గైడ్–2026 నివేదిక ప్రకారం, 2026 సంవత్సరంలో దాదాపు అన్ని రంగాల్లో జీతాలు సగటున 8 నుంచి 12 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్, ఇంజినీరింగ్, మాన్యుఫాక్చరింగ్, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో ఈ పెంపు మరింత స్పష్టంగా కనిపించనుంది.

The Salary Guide 2/5

జాబ్ సాలరీ హైక్

ఇక కొత్త స్కిల్స్ ఉన్నవారికి ఇది మరింత మంచి సమయం అని నిపుణులు చెబుతున్నారు. టెక్నాలజీకి అనుగుణంగా తమ నైపుణ్యాలను అప్‌డేట్ చేసుకున్నవారు ఉద్యోగం మార్చితే, కంపెనీలు 30 శాతం వరకు ఎక్కువ జీతాలు ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికి డిమాండ్ ఎక్కువగా ఉంది.

Salary Hike 20263/5

జాబ్ సాలరీ హైక్

ఈ నివేదిక ప్రకారం CFO (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్), CTO (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్), అలాగే ఇంజినీరింగ్ హెడ్ వంటి కీలక హోదాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. కంపెనీలు అనుభవం ఉన్న నాయకత్వ స్థాయి ఉద్యోగుల కోసం భారీ ప్యాకేజీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది.  

Salary Hike4/5

జాబ్ సాలరీ హైక్

కరోనా తర్వాత కొంతకాలం ఉద్యోగ మార్కెట్ ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఇప్పుడు పరిస్థితి మెరుగవుతోంది. కంపెనీలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడంతో పాటు, విస్తరణపై దృష్టి పెట్టడంతో ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతున్నాయి. దీని వల్ల ఉద్యోగులపై పోటీ పెరిగి జీతాలు పెరగడం సహజంగా మారిందని నిపుణులు అంటున్నారు.

Job Salary Hike 5/5

జాబ్ సాలరీ హైక్

2026 సంవత్సరం ఉద్యోగుల కోసం ఆశాజనకంగా ఉండబోతోంది. సరైన స్కిల్స్, అనుభవం ఉంటే మంచి జీతం, మంచి అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.