8th Pay Commission Salary Hike: ఎనిమిదో వేతన సంఘం గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవలే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే దీనిని అమలు చేయబోతున్నట్లు తెలిపింది. అయితే దీనివల్ల 36.57 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు లబ్ధి చేకూరబోతోంది.
8th Pay Commission Salary Hike: కొన్ని ఏళ్ల నుంచి ఎనిమిదవ వేతన సంఘం చర్చనీయాంశంగా ఉంది. లక్షలాదిమంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతో పాటు ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దీనిపై ఇటీవలే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఎనిమిదో వేతన సంఘం అమలు చేస్తే దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న 36 లక్షల మంది కంటే ఎక్కువగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు లబ్ధి చేకూరుతుందని ఆమె స్పష్టం చేశారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 1వ తేదీ నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్ల సంఖ్య 36.57 లక్షలని కాగా.. ఎనిమిదో వేతన సంఘం (8th Pay Commission) అమలయితే వీరందరికీ లబ్ధి చేకూరుతుందని తెలిపింది.
ఈ ఎనిమిదో వేతన సంఘాని (8th Pay Commission)కి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఉద్యోగ సంఘాల సిఫారసులను పరిశీలించబోతున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అయితే ఈ ఎనిమిదో వేతన సంఘానికి సంబంధించిన అమలు పై త్వరలోనే నిర్మల సీతారామన్ గుడ్ న్యూస్ తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి.
2016లో ఏడవ వేతన సంఘం అమలు చేయగా.. 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎనిమిదో వేతన సంఘం అమలు అమలవుతుంది. దీని కారణంగా జీతాలతో పాటు పెన్షన్ల సవరణ కూడా జరుగుతుంది. ఈ వేతన సంఘం అమలయితే దాదాపు అన్ని స్థాయిలో ఉద్యోగులకు జీతాలు ఘననీయంగా పెరుగుతాయి.
ఇక గ్రూప్ డి ఉద్యోగులకు సంబంధించిన బేసిక్ శాలరీ నెలకు రూ.18 వేలు అయితే.. కొత్త వేతన సంఘం అమలు అయితే ఏకంగా రూ.51 వేలకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల జీతాల్లో భారీగా మార్పులు వస్తాయి. అలాగే దీనికి సంబంధించిన ఫిట్మెంట్ కూడా 2.57 నుంచి 2.86 పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఎనిమిదో వేతన సంఘం (8th Pay Commission) అమలులోకి వస్తే జీతాలతో పాటు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు జీవన వ్యాయం రోజురోజుకు పెరగడం వల్ల ఆర్థిక భారం పెరిగిపోతోంది. అయితే ఈ వేతన సంఘం అమల్లోకి వస్తే.. పెన్షన్ కూడా విపరీతంగా పెరుగుతుంది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఎనిమిదో వేతన సంఘం గురించి డిమాండ్ల రాక పెరుగుతూ వస్తోంది. అయితే తుది నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్రభావాన్ని జాగ్రత్తగా అంచనా వేయడం వేతన సంఘం అమలుకు ముందు తప్పనిసరి. అయితే ఈ సమయంలో ఆర్థిక వ్యవస్థ పై ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలతో ఎనిమిదో వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.