Salman Khan costar Tulip Joshi: కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించిన ఈ భామ ప్రస్తుతం జ్యోతిష్యురాలిగా మారడంపై అందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా..తన భర్తతో కలసి 700 కోట్ల విలువైన కంపెనీ ఉండి కూడా ఇప్పుడు జ్యోతిష్యం ఏంటని కూడా అందరు షాక్ అవుతున్నారు.
1/6చాలా మంది సెలబ్రీటీలు సినిమాల్లో ఎక్కువగా రాణించేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఇటీవల పెళ్లైన కూడా తమసెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెడుతున్నారు.ఈ క్రమంలో కొంత మంది ఇటు మూవీస్ చేస్తునే మోడలింగ్, బిజీనెస్ రంగంలో కూడా అడుగు పెట్టి రాణిస్తున్నారు.
2/6ఈ క్రమంలో ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏకంగా సినిమాలు వదిలేసి ఏకంగా జ్యోతిష్యురాలిగా మారి అందర్ని విస్మయంకు గురిచేసింది. సాధారణంగా హీరోయిన్ అవ్వాలని చాలా మంది భావిస్తారు. కొంత మంది అనుకొకుండా వచ్చి స్టార్ డమ్ సంపాదిస్తే, మరికొంత మంది మాత్రం స్టార్ గా పేరు కోసం ఎంతో కష్టపడుతారు.
3/6బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో నటించిన తులీప్ జోషి ప్రస్తుతం మూవీస్ ను వదిలేసిన జ్యోతిష్యంలో అడుగు పెట్టింది. ఒకప్పుడు ఆమె సినిమాల్లో టాప్ హీరోయిన్లలో ఒకరు.
4/6. తులిప్ జోషి మొదటి సినిమా ‘మేరే యార్ కి షాదీ హై’లో చేసింది.ఈ సినిమా 2014లో రిలీజైంది. ఈ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ... ఆతర్వాత కండల వీరుడు సల్మాన్ ఖాన్ తొ నటించిన ‘జై హో’ చిత్రంలో కనిపించింది. ఆతర్వాత ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న కెప్టెన్ వినోద్ నాయర్‌ను వివాహం చేసుకుంది.
5/6వినోద్ పంజాబ్ రెజిమెంట్‌లోని 19వ బెటాలియన్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత బిజినెస్ ను స్టార్ట్ చేశారు. భార్యభర్తలు ఇద్దరు కూడా బిజినెస్ ను చూసుకునేవారు. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ రూ.700 కోట్లు.ఈ నేపథ్యంలో వీటన్నింటిని వదిలి ఈ భామ జ్యోతిష్యం రాణించాలని అనుకుంది.
6/6తనకు ఎప్పటి నుంచో ఫెమస్ జ్యోతిష్యురాలిగా మారాలని అన్పించేదని, ప్రస్తుతం అదే పనిలో ఉన్నానని ఈ భామ చెప్పడం అందర్ని ఆశ్చర్యంకు గురిచేస్తుంది. అయితే.. ఇప్పటికే చాలా మంది తులీప్ జోషి దగ్గరకు వెళ్లి తమ జాతకాలు కూడా చెప్పించుకుంటున్నారని సమాచారం.