Salman Khans Top 5 Openers: సల్మాన్ ఖాన్.. ఒకప్పుడు బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా సత్తా చాటాడు. రాను రాను హీరోగా సల్మాన్ ఖాన్ ఇమేజ్ డౌన్ ఫాల్ అవుతోంది. తాజాగా ఇపుడు సౌత్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘సికందర్’ మూవీ తో పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో సల్మాన్ రీసెంట్ మూవీస్ టాప్ 5 ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల విషయానికొస్తే..
సికందర్.. సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న హీరోయిన్ గా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సికందర్’. ఈ సినిమా ఉగాదితో పాటు ఈద్ పండగ సందర్భంగా ఈ నెల 30న విడుదల కాబోతుంది. ఈ సినిమా సల్మాన్ .. గత సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి.
టైగర్ 3: టైగర్ సిరీస్ లో భాగంగా మనీష్ శర్మ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘టైగర్ 3’ . ఈ సినిమా 2013 దీపావళి కానుకగా ఆదివారం రోజున ఫస్ట్ డే మన దేశంలో రూ. 43 కోట్ల నెట్ వసూళ్లతో టాప్ 1 లో నిలిచింది.
భారత్.. 2019లో అలీ అబ్బాస్ జఫర్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘భారత్’. 2019 ఈద్ కానుకగా విడుదలైన ఈ సినిమా తొలి రోజు.. రూ. 42.30 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి టాప్ 2లో నిలిచింది.
ప్రేమ్ రతన్ ధన్ పాయో.. సూరజ్ ఆర్ బర్జాత్యా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’. ఈ సినిమా 2015 దీపావళి కానుకగా విడుదలైంది. ఈ సినిమా తొలి రోజు.. రూ. 40.35 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి టాప్ 3లొ నిలిచింది.
సుల్తాన్.. సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో అనుష్క శర్మ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘సుల్తాన్’. ఈ సినిమా 2016 ఈద్ కానుకగా రూ. 36.54 కోట్ల నెట్ వసూళ్లతో టాప్ 4లో నిలిచింది.
టైగర్ జిందా హై .. టైగర్ జిందా హై మూవీ 2017 క్రిస్మస్ కానుకగా 34.10 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి టాప్ 5లో రాబట్టింది. టైగర్ సిరీస్ లో వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది.