Salman Khan: రష్మిక కూతురితో కూడా ఆ పనిచేస్తా..?.. షాకింగ్ కామెంట్స్ చేసిన సల్మాన్ ఖాన్.. మ్యాటర్ ఏంటంటే..?

Salman khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. సికిందర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేళ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. రష్మికను పెళ్లైన కూడా వదిలిపెట్టనని కామెంట్లు చేశాడు సల్లుభాయ్. అంతటితో  ఆగకుండా  ఆమెకు లేని నొప్పి మీకు ఎందుకంటూ కౌంటర్ లు వేశాడు.
 

1 /6

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నలు కలిసి సికిందర్ మూవీలో నటించారు. బాలీవుడ్ దర్శకుడు మురుగ దాస్ దీన్ని తెరకెక్కించారు. రంజాన్ కు కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా కీలక పాత్రలో కన్పించనున్నారు.  

2 /6

అయితే.. ఇటీవల ఈ మూవీ విషయంలో సల్మాన్ కు, రష్మిక కు మధ్య 31 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందని.. సోషల్ మీడియాలో తెగట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాకుండా..రష్మిక తండ్రి కన్న కూడా సల్మాన్ ఖాన్ 3 ఏళ్ల పెద్దవాడని కామెంట్లు చేస్తున్నారు.  

3 /6

దీనిపై తాజాగా.. సికిందర్ మూవీ ప్రీలాంచ్ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ రియాక్ట్ అయ్యారు. ఏజ్ గ్యాప్ విషయంలో వస్తున్న ట్రోలింగ్ లను కొట్టిపారేశారు. ఈ సినిమాలో నటిస్తున్న రష్మికకు లేని నొప్పి .. మీకెందుకని అభిమానులకు చురకలు పెట్టారు. అంతేకాకుండా.. రష్మికకు పెళ్లైన కూడా ఆమెతో కలిసి నటిస్తానన్నారు.  

4 /6

ఫ్యూచర్ లో రష్మిక కూతురు కూడా పెద్ద స్టార్ అవుతుందని..అప్పుడు రష్మిక పర్మిషన్ తో ఆమె కూడా అవకాశం ఉంటే.. అప్పుడు కూడా నటిస్తానని స్ట్రాంగ్ కౌంటర్ లు వేశారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ గా మారాయి.  

5 /6

మరోవైపు.. సల్మాన్ ఖాన్ కు చాలా రోజులుగా ఎలాంటి హిట్ కూడా రాలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం గోల్డెన్ గర్ల్ గా మారిపోయిన రష్మికతో చేసిన ఈ మూవీ హిట్ ను సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

6 /6

 ఇప్పటికే ఛావా బాక్సాఫీస్ మీద భారీగా వసూళ్లను రాబడుతుంది. ఇక సికిందర్ మూవీ హిట్ అయితే.. రష్మికను మాత్రం ఇక తట్టుకొవడం ఎవరి తరం కాదని సిని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక వైపు వివాదాలతోను, మరోవైపుస్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తు రష్మిక వెిండితెరపై దుమ్ము రేపుతుంది.