Samantha Engagement: ఈ డిసెంబర్ 1న సమంత.. ఫ్యామిలీమ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకొని అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈషా ఫౌండేషన్ లో ఉన్న లింగ భైరవి ఆలయంలో భూత శుద్ధి వివాహం చేసుకుంది సామ్. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ద్వారా రాజ్ అందరికీ సుపరిచితమే. ఇక ఈ పెళ్లితో మరోసారి తెలుగింటి కోడలు అయింది సమంత.
1/5సమంత.. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ శుభవార్తను తన అభిమానులతో పంచుకుంది. దీంతో సమంత, రాజ్ నిడిమోరు దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
2/5అయితే సమంత రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నట్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇంతకాలం ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున ఒక సీక్రెట్ ఫోటోతో హింట్ ఇచ్చింది సమంత.
3/5అంతేకాకుండా వీలైనప్పుడల్లా రాజ్ నిడిమోరుతో ఉన్న ఫోటోలను.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేది. ఇక నిన్న సమంత షేర్ చేసిన ఫోటోలలో అందరికీ.. ఆమె చేతి రింగ్ చాలా నచ్చేసింది. అయితే అది వారి ఎంగేజ్మెంట్ రింగ్.
4/5నిన్న పెళ్లిలో రాజ్.. సమంత వేలికి తొడిగినప్పటికీ.. వీరిద్దరూ ఫిబ్రవరిలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఫిబ్రవరి 13న సమంత తన ఎంగేజ్మెంట్ రింగ్ ని చూపిస్తూ.. ఇన్ స్టాలో ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసింది.
5/5కానీ అప్పుడు అది ఎంగేజ్మెంట్ రింగ్ అని ఎవరికీ అర్థం కాలేదు. ఒకరిద్దరూ ఫ్యాన్స్ మాత్రం అప్పుడే గెస్ చేశారు. ఇక ఆ తర్వాత నుండి సామ్ ప్రతి ఈవెంట్ లో కూడా అదే రింగ్ తో కన్పించింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిన 10 నెలల తర్వాత సింపుల్ గా పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తోంది సమంత.