Add Zee Business As A Preferred Source
App

Samantha - B Saroja Devi: అప్పట్లో బి సరోజా దేవి.. ఇప్పట్లో సమంత ఆ అవమానాన్ని ఎదుర్కొన్నవారే..

Written ByTA Kiran Kumar
Published: Aug 03, 2025, 05:59 AM IST|Updated: Aug 03, 2025, 07:52 AM IST

Samantha - B.Saroja Devi: బి. సరోజా దేవి.. 1950లలో కన్నడ, తెలుగు, తమిళ, హిందీ సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగింది. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి పద్మ అవార్డులను అందుకుంది. గత నెలలో కన్నుమూసిన ఈమె కు జరిగిన ఓ అవమానం .. ఈ జనరేషన్ లో సమంతకు జరిగింది. 

 

Samantha - B.Saroja Devi1/6

సమంత - శకుంతల

Samantha - B.Saroja Devi: బెంగళూరు సరోజా  దేవి కన్నడ సినీ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ కథానాయక. తెలుగులో ఎన్టీఆర్ స్వీయ నిర్మాణంలో కమలకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పాండురంగ మహత్యం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 

B. Saroja Devi 2/6

బి.సరోజా దేవి

ఆ తర్వాత ఎన్టీఆర్ తో పాటు పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. ఇక అక్కినేని నాగేశ్వరరావు తో కూడా బి.సరోజా దేవి పలు హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. 

Shakunthala Flop 3/6

శకుంతల ఫ్లాప్

ఇక బి.సరోజా దేవి ఎన్టీఆర్ హీరోగా కమలకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘శకుంతల’ అనే సినిమాలో టైటిల్ రోల్ పోషించింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేకపోయింది. 

Braharshi Viswamitra4/6

బ్రహ్మర్షి విశ్వామిత్ర

ఆ తర్వాత ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో కూడా దుష్యంతుడు, శకుంతల ఎపిసోడ్ ఉంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. 

Shaakuntalam Flop 5/6

శాకుంతలం ఫ్లాప్

ఆ తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో సమంత టైటిల్ రోల్లో నటించిన ‘శాకుంతలం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

Shakunthala 6/6

శకుంతల

ఈ రకంగా అప్పట్లో శకుంతల సినిమాతో బి.సరోజా దేవి అవమానం పాలైతే.. తాజాగా ఈ జనరేషన్ లో సమంత కూడా అదే రేంజ్ లో ఈ సినిమాతో అవమానం పాలు కావడం విశేషం. మొత్తంగా తెలుగులో శకుంతల, దుష్యంతల కాన్సెప్ట్ తో వచ్చిన మూడు చిత్రాలు కూడా డిజాస్టర్స్ గా నిలవడం విశేషం.