Samantha: హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. గత 16 యేళ్లుగా టాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా రాణిస్తోంది. ఆ మధ్య కాలంలో మయాసిటీస్‌తో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి హీరోయిన్ గా బ్యాక్ బౌన్స్ అయింది. అంతేకాదు ఎన్నడు లేనట్టుగా హాట్ క్లీవేజ్ షోతో రచ్చ లేపుతోంది.
Samantha:సమంత (Samantha Ruth Prabhu) కొత్తగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. గత 16 యేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా సత్తా చూపెడుతోంది. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన 'ఏమాయా చేసావే' చిత్రంతో కథానాయికగా లెగ్ పెట్టిన సామ్.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఈ చిత్రంలో జెస్సీ పాత్రలో సమంత యాక్టింగ్‌ను ఎవరు మరిచిపోలేదు.
దాదాపు 16 యేళ్ల కెరీర్‌లో ఎన్నో డిఫరెంట్ చిత్రాలతో మెప్పించింది. అందులో గుణ శేఖర్ దర్శకత్వంలో చేసిన 'శాకుంతలం' వంటి పౌరాణిక సినిమా కూడా కూడా ఉంది. అటు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తూ సత్తా చాటుతోంది.
సమంత.. ఆ మధ్య మయాసిటీస్ అనే వింత వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయాన్ని అభిమానులతో ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది సమంత ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేస్తోంది. ఇక 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో ఈమె ఎల్టీటీఈ ఉగ్రవాది పాత్రలో యాక్ట చేసిన సంగతి తెలిసిందే కదా.
మరోవైపు వరుణ్ ధావన్‌తో కలిసి రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో 'సిటాడెల్' హన్ని బన్ని వెబ్ సిరీస్ తో పలకరించింది. ఈ సిరీస్ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ఆ సంగతి పక్కన పెడితే.. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉన్న సమంత.. మాయాసిటీస్ నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులు షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంది సమంత.
సమంత.. పర్సనల్ విషయానికొస్తే.. ఆ మధ్య కథానాయకుడు అక్కినేని నాగ చైతన్యతో ఈమె మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత వీరిమధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.
ప్రస్తుతం సమంత, నాగ చైతన్య ఎవరి జీవితాలను వారు లీడ్ చేస్తున్నారు. ఎవరి సినిమాలు వాళ్లు చేస్తున్నారు. నాగ చైతన్య శోభితతో వివాహాం జరిగింది. అంతేకాదు ఇద్దరు వెబ్ సిరీస్‌లలో దూసుకుపోతున్నారు.