Add Zee Business As A Preferred Source
App

Samantha: అప్పుడేమో ఇష్టంగానే అలా చేసేసి.. ఇప్పుడేమో ఇబ్బంది పడ్డానంటున్న సమంత

Written ByAruna Maharaju
Published: Oct 28, 2025, 01:36 PM IST|Updated: Oct 28, 2025, 01:41 PM IST

Actress Samantha: హీరోయిన్ సమంత గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకెళ్లింది సమంత. ఇటీవల సినిమాల నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్న సామ్.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత కెరీర్ స్టార్టింగ్‌లో.. తనకి ఇష్టం లేని పాత్రల్లో నటించానని అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో సామ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. 
 

Actress Samantha1/5

సమంత

ఇప్పుడున్న చాలా మంది హీరోయిన్స్ అప్పట్లో తమకు నచ్చకుండానే కొన్ని పాత్రలు చేయాల్సి వచ్చిందని చెప్తుంటారు. ఇష్టం లేకుండానే కేవలం సినిమాల్లో ఛాన్సుల కోసమే అలాంటి పాత్రలు చేశామని చెప్తారు కొంతమంది. తాజాగా ఇదే విషయంపై నటి సమంత ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

Actress Samantha2/5

సమంత

సమంత మాట్లాడుతూ.. కెరీర్ స్టార్టింగ్‌లో చాలా గ్లామరస్ పాత్రలు చేశాను. అందులో నాలా అనిపించలేదు. వేరే హీరోయిన్స్‌లా ఉండటానికి, వాళ్లలాగా కనిపించడానికి, నటించడానికి, డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించేదాన్నని.. అలాంటి పాత్రల్లో నేను చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది.   

Actress Samantha3/5

సమంత

ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ సినిమాలోని క్యారెక్టర్స్ అన్ని ఫుల్ ఫన్నీగా అనిపిస్తాయి. అప్పట్లో నేను ఎంత బ్యాడ్‌గా నటించానో అనుకునేదాన్ని.. కానీ నేను కొత్తగా నేర్చుకోడానికి అదొక్కటే దారి అని సామ్ చెప్పింది. పరిశ్రమలో ఎలాంటి సంబంధాలు లేకుండా నేనే స్వయంగా వచ్చి అన్ని నేర్చుకున్నాను అని సమంత తెలిపింది.  

Actress Samantha4/5

సమంత

గతంలో సామ్ చాలా సినిమాల్లో గ్లామర్ షో చేసింది. సికిందర్ లాంటి సినిమాలో బికినీ కూడా వేసుకుంది. కొన్ని సినిమాల్లో రొమాంటిక్ సీన్స్, పొట్టి పొట్టి డ్రెస్‌లతో గ్లామరస్ పాత్రలు చేసింది. అలాంటి రోల్స్ అన్ని అప్పుడు అవకాశాల కోసమే చేశానని.. అప్పుడు ఇబ్బంది పడుతూనే చేశానని చెప్పుకొచ్చింది సమంత.

Actress Samantha5/5

సమంత

అయితే ఇప్పుడు ఇలా చెప్తున్న సమంత.. అప్పట్లో వచ్చిన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయడం గమనార్హం. ఇక సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా చేస్తూ ఎక్కువగా బిజినెస్‌ల మీదే ఫోకస్ పెట్టింది.