Actress Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే సమంత.. తాజాగా తన రూమర్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరుతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకోగా.. పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
1/9సమంత.. తన అందం, అభినయం, నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ‘ఏమాయ చేశావే’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసింది సమంత.
2/9ఆ తర్వాత వరుస సినిమాలతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది.
3/9సమంత నాగచైతన్యతో డివొర్స్, ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్‌తో బాగా సఫర్ అయిన విషయం తెలిసిందే. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సామ్.. ఇప్పుడిప్పుడే దాని నుండి బయటికొచ్చి.. మళ్లీ సినిమాలను చేస్తూ ప్రొడ్యూసర్‌గా కూడా చేస్తోంది.
4/9ఇక సమంత డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎక్కడా చూసిన వీరిద్దరే కన్పిస్తున్నారు.
5/9దీంతో త్వరలో ఈ రూమర్స్ కపుల్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ.. వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మాత్రం వీరిద్దరూ ఇంతవరకూ ఎక్కడా స్పందించలేదు.
6/9అయితే తాజాగా సమంత తన దీపావళిని రాజ్ నిడిమోరుతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఫొటోలను స్వయంగా సామ్.. తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
7/9ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్స్ త్వరలోనే సమంత.. రాజ్‌తో రెండవ పెళ్లికి రెడీ అయిందన్న క్లారిటీకి వచ్చేశారు. కాగా సామ్ షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే ఈ పిక్స్.. నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.
8/9ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాలీవుడ్‌లో రక్త్ బ్రహ్మాండ్ అనే మూవీ చేస్తోంది. రాజ్ నిడిమోరు అండ్ డీకే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
9/9అలాగే తెలుగులో సమంత చేస్తున్న సినిమా మా ఇంటి బంగారం. నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే 2026లో రిలీజ్ కానుంది. మరి చాలా గ్యాప్ తరువాత సమంత చేస్తున్న ఈ రెండు సినిమాలు.. ఆమెకు ఎలాంటి రిజల్ట్‌ను ఇస్తాయనేది చూడాలి.