Samantha Personal Life : సమంత తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. అతను లేకపోతే.. నేను లేను అని తాజాగా సమంత చెప్పిన మాటలు.. తెగ వైరల్ అవుతూ ఉన్నాయి.. పూర్తి వివరాల్లోకి వెళితే..
1/5సమంత చెప్పే ప్రతిమాట మీడియాలో పెద్ద కథనంగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సమంత ప్రొఫెషనల్ లైఫ్ కన్నా కూడా తన పర్సనల్ లైఫ్ ద్వారా తరచు వార్తల్లో నిలుస్తూ ఉంది.
2/5సమంత.. దర్శకుడు రాజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయం ఎన్నో రోజుల నుంచి వైరల్ అవుతూ ఉన్న.. ఈ విషయం గురించి ఇంకా ఇద్దరు కూడా అధికారికంగా ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు.
3/5ఇక దర్శకుడు రాజ్..సహాయంతో సమంత ఈ మధ్యనే నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ కలిసి శుభం సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకొని.. ఆ సినిమా ద్వారా ఎంతో కొంత మందిని పరిచయం చేశారు.
4/5ఈ నేపథ్యంలో సమంతాన్ని సుమ.. మీరు నిర్మాతగా ఎందుకు అన్ని బరువు బాధ్యతలు మీ పైన వేసుకున్నారు అని ప్రశ్నించగా…”గౌతమ్ వాసుదేవ్ మీనన్ అనే మనిషి లేకపోతే అసలు నేను లేను.. నన్ను నమ్మి ఏం మాయ చేసావే సినిమాలో నన్ను తీసుకు ఉండకపోతే.. ప్రస్తుతం నేను ఇలా ఉండేదాన్ని కాదు..,”అని తెలియజేసింది సమంత.
5/5ఈ క్రమంలో సమంత తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి గౌతమ్ లేకపోతే తను లేను అంటూ చెప్పకు వచ్చింది ఈ హీరోయిన్.