Add Zee Business As A Preferred Source
App

Samantha: వెండితెర బంగారు కొండ సమంత.. ఇంత మంచిదాన్ని నాగచైతన్య ఎలా వదులుకున్నాడో..

Published: Oct 11, 2025, 02:25 PM IST|Updated: Oct 11, 2025, 02:25 PM IST

Samantha Have Golden Heart Unnecessarily Naga Chaitanya Get Divorce: సినీ పరిశ్రమలో ఫేమ్‌ కొద్దీ సంపాదన ఉంటుంది. వెండితెరలో మెరిస్తే కోట్లు కోట్లు వస్తాయి. అయితే కొందరు ఆస్తులు కూడబెట్టినా సమాజానికి ఏమీ ఇవ్వరు. కానీ కొందరు సినీ నటీనటులు మాత్రం సమాజానికి కొంత మేలు చేస్తారు. అలా సమంత ఎంతో సేవ చేస్తున్నారు. ఆమె చేస్తున్న సేవ చూస్తే 'బంగారు కొండ' అనక మానరు.

1/8

సినీ పరిశ్రమలో తాను సంపాదించిన కొంతలో సమాజానికి వెచ్చిస్తున్న సినీ నటీనటులు చాలా తక్కువనే ఉంటారు. స్టార్లుగా గుర్తింపు పొందినా రూపాయి విదల్చని వారు ఎందరో ఉన్నారు. కానీ సమంత అలా కాదు. ఎంత ఎదిగినా ఒదిగినట్టు ఉండే స్వభావం కలిగిన సమంత ఎన్నో సేవలు చేస్తోంది.

2/8

స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలోనే సమంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రత్యూష సపోర్టు అనే ఫౌండేషన్‌ను స్థాపించింది. జీవితంలో తనకు ఎదురైన విపత్కర పరిస్థితి నుంచి పాఠం నేర్చుకున్న సమంత సమాజంలో తనలాంటి బాధితులకు అండగా ఉండాలని ఫౌండేషన్‌ ఏర్పాటుచేసింది.

3/8

2013లో సమంత తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. శారీరకంగా.. మానసికంగా వేదనకు గురయ్యింది. డబ్బులు ఉండీ కూడా తాను అంతలా ఇబ్బంది పడుతుంటే ఏమీ లేని పేదలు.. అన్నార్తులు అనారోగ్యంతో ఎంత ఇబ్బంది పడుతున్నారో అని భావించి ప్రత్యూష ఫౌండేషన్‌ను సమంత స్థాపించింది.

4/8

సమాజంలో ప్రాణాంతక వ్యాధులు (క్యాన్సర్‌ తదితర), దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలకు ప్రత్యూష ఫౌండేషన్‌తో సమంత సహాయ కార్యక్రమాలు చేస్తోంది. ఇప్పటికీ కార్యక్రమాలు కొనసాగిస్తోంది.

5/8

బాలికలు, మహిళలకు అండగా సమంత తన ఫౌండేషన్‌ ద్వారా నిలుస్తున్నారు. తరచూ ఫౌండేషన్‌ సేవలను సమంత పర్యవేక్షిస్తున్నారు. నిపుణులైన వైద్యులతో బాధితులకు వైద్యం అందిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి యోగక్షేమాలు సమంత ఆరా తీస్తున్నారు.

6/8

తన సొంత ఖర్చుతోపాటు పలువురు విరాళాలతో సమంత ప్రత్యూష ఫౌండేషన్‌ నిర్వహిస్తున్నారు. ఈ ఫౌండేషన్‌ ఇప్పుడు ఆమెకు ప్రధాన బాధ్యతగా భావిస్తోంది. ఈ క్రమంలోనే పలు వైద్య సదస్సులు.. వైద్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో సమంత పాల్గొంటున్నారు. వీటికి సంబంధించిన పాడ్‌కాస్ట్‌లు సమంత చేస్తున్నారు.

7/8

ప్రత్యూష ఫౌండేషన్‌ ద్వారా రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు సమంత ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రస్తుతానికి తెలంగాణ, ఏపీలో జరుగుతున్నాయని.. సమంత నివసిస్తున్న ముంబైలో కూడా ఫౌండేషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆమె చేస్తున్న సేవలకు ఇప్పటికే కొన్ని అవార్డులు కూడా వచ్చాయి.

8/8

స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తూ సమాజానికి మేలు చేస్తున్న సమంతను 'వెండితెర బంగారు కొండ' అనక తప్పదు. గొప్ప మనసు, మానవత్వం కలిగిన సమంతను అభినందించకుండా ఉండలేం. వ్యక్తిగత విషయాలు పక్కనపెడితే సమాజానికి సేవ చేస్తున్న సమంతకు 'జీ తెలుగు న్యూస్‌' తరఫున అభినందనలు.