Add Zee Business As A Preferred Source
App

Samantha Gym Body: రెండో పెళ్లికి ముందు వస్తాదులా బాడీ పెంచిన సమంత! మళ్లీ అందుకోసమే బరిలో దిగానంటూ పోస్ట్!

Written ByHarish Darla
Published: Dec 03, 2025, 04:45 PM IST|Updated: Dec 03, 2025, 04:45 PM IST

Samantha Body Fitness: ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంతకు జిమ్‌లో చెమటోడ్చడం చాలా ఇష్టమట. కొన్నేళ్ల క్రితం అనారోగ్యానికి గురైన సమంత.. ఇప్పుడు పూర్తిగా కోలుకొని జిమ్‌కి వెళ్లి తిరిగి పూర్వవైభవం (ఫిట్‌నెస్) సాధించింది. 38 ఏళ్ల వయసులోనూ ఆమె ఇంత యవ్వనంగా కనిపించడానికి రహస్యం ఇదేనట.

Samantha Gym Workouts1/5

స్టార్ హీరోయిన్ సమంతకు ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేయడం చాలా ఇష్టం. ఈ ఫొటోనే అందుకు సాక్ష్యంగా కనిపిస్తుంది. ప్రతిరోజూ జిమ్‌లో చెమటోడ్చడం వల్లే ఆమె ఇప్పటికీ 18 ఏళ్ల పడుచుపిల్లలాగ కనిపిస్తుంది. 

Samantha Fitness freak2/5

జిమ్‌కు అలవాటు పడిన సమంత.. పూర్తిగా తన ఛేంజ్‌ఓవర్ కోసం కష్టపడింది. ఆమె పురుషుడిలా దేహదారుఢ్యం కనిపించేందుకు ఆమె ఎంతో కఠినమైన వ్యాయామాలు చేస్తోంది. జిమ్ లేదా వ్యాయామం చేయడం వల్ల మీకు క్రమశిక్షణ పెరగడం సహా ఓపికను నేర్చుకుంటారని సమంత చెబుతోంది.

Samantha Second Marriage3/5

జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు ఆమె ఫిట్‌నెస్ ట్రైనర్‌తో పోటీపడుతున్న ఫొటో ఇది. గతంలో తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా కొన్ని నెలల క్రితం సమంత జిమ్‌ వర్కౌట్స్‌ను ఆపేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆమె వ్యాయామం చేయడం ప్రారంభించింది. ఇప్పుడు తాను తిరిగి ఫిట్‌నెస్ సాధించింది. 

Samantha Raj Nidimoru4/5

అలాగే పగటిపూట జిమ్ చేసే వ్యక్తులు ఎవరైనా రాత్రి బాగా నిద్రపోవాలి. రోజుకు కొన్ని గంటలపాటు వ్యాయమం చేసిన తర్వాత శరీరం ఎంతో అలసిపోతుందని హీరోయిన్ సమంత చెప్పుకొచ్చింది. అలా శరీరానికి తగినంత నిద్ర ఉండాలని ఆమె అభిప్రాయపడింది. 

Samantha Gym5/5

అయితే హీరోయిన్ సమంత ఉదయాన్నే వ్యాయామం చేయడం మర్చిపోదు. సినిమాల్లో అవకాశాల కోసం సహా ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకు సమంత ప్రతిరోజూ ఉదయం రన్నింగ్ లేదా యోగా చేస్తుంది.