Add Zee Business As A Preferred Source
App

Samantha: 'స్టార్ హీరోయిన్‌ కావడం.. నా పాపులారిటీ కారణం అతడే!'.. హీరోయిన్ సమంత

Published: Sep 11, 2025, 09:32 PM IST|Updated: Sep 12, 2025, 09:41 PM IST

Samantha Given Her Stardom Credit To One Person Know Who Behind Her: సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన సినీ నటి సమంత ప్రస్తుతం వివిధ వ్యాపకాలతో బిజీగా ఉన్నారు. అడపదడప సినిమాల్లో మెరుస్తున్న సమంత తన స్టార్‌ డమ్‌కు కారణమెవరో? తన పాపులారిటీకి క్రెడిట్‌ మొత్తం ఒక్కరికే ఇచ్చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

1/6

స్టార్‌ హీరోయిన్‌గా ఓ దశాబ్దానికి పైగా విశేష గుర్తింపు పొందిన సమంత ప్రస్తుతం ఇతర వ్యాపకాలతో బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తున్న సమంత ప్రస్తుతం వ్యాపారాలు చేస్తూ గుర్తింపు పొందుతున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన స్టార్‌డమ్‌, పాపులారిటీ, గుర్తింపు మొత్తం కొందరి కారణంగా వచ్చిందని ప్రకటించారు. ఎవరో తెలుసుకుందాం.

2/6

కొన్నాళ్లుగా వైద్యపరమైన అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటూ మెడికల్‌ సంబంధిత వ్యాపారం కూడా సమంత ప్రారంభించారు. మహిళలకు సంబంధించిన వైద్యపరమైన సహాయంలో సమంత బిజీగా ఉన్నారు. ఇటీవల ఓ వ్యాపారం కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.

3/6

ఓ వైద్య సదస్సులో పాల్గొన్న సమంత హోస్ట్‌ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమంత సమాధానం ఇచ్చారు. ఇంత స్టార్‌డమ్‌, గుర్తింపు, పాపులారిటీ దక్కడం వెనుక ఎవరు ఉన్నారని ప్రశ్నలు వేయగా.. వాటికి సమంత ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

4/6

తాను చిన్న పట్టణం నుంచి వచ్చానని.. కల కనడం అనేది ఒక సాహసమని సమంత తెలిపారు. ఆ విధంగా కల కని ఈ స్థాయిలో ఉన్నానని.. అయితే ఇంతటి గుర్తింపు లభించడం తన ఒక్క దాని వలన జరగలేదని సమంత పేర్కొన్నారు. ఇంతటి గుర్తింపు పొందడం అంటే ఒక తలకు భారమని ప్రకటించారు.

5/6

తనకు దక్కిన స్టార్‌డమ్‌, గుర్తింపు, పాపులారిటీ మొత్తం తన బృందానిది అని సమంత ప్రకటించారు. అంటే తన వెంట ఉన్న సహాయ సిబ్బంది.. తన టీమ్‌ సహకారంతోపాటు ప్రేక్షకుల ఆదరాభిమానం కారణమని సమంత తెలిపారు.

6/6

వైద్య సదస్సులో పాల్గొన్న ఫొటోలతోపాటు వీడియోను సమంత పంచుకున్నారు. 'నేషనల్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో నేను పాల్గొన్నా. వ్యాపారం, నాయకత్వం భవిష్యత్తును రూపొందించే అద్భుతమైన మహిళలతో చేరే అదృష్టం నాకు లభించింది' అని సమంత పోస్టు చేశారు. 'మనం ముందుకు అడుగుపెట్టి.. రిస్క్ తీసుకొని సొంత బలంపై నమ్మకం ఉంచినప్పుడు పురోగతి వస్తుందని నాకు కచ్చితంగా తెలుసు' అని తెలిపారు. దార్శనికత ఉన్న ప్రతి మహిళకు వారి మాటలు ముఖ్యం, వారి ఆలోచనలు చాలా ముఖ్యం అని సమంత ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ప్రపంచానికి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.