Naga Chaitanya first wife
సమంత, నాగ చైతన్య విడిపోయినా.. వారి గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా సమంత, నాగచైతన్య గురించి మరో వార్త ఒకటి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదేమిటి అంటే నాగచైతన్య మొదటి భార్య సమంత కాదంట. మరి నాగచైతన్య మొదటి భార్య ఎవరో ఒకసారి మీరు కూడా చూసేయండి..!
సమంత, నాగచైతన్య విడిపోయి ఎన్నో సంవత్సరాలు కావస్తున్న ఇంకా వీరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో గతంలో సమంత.. నాగచైతన్యకు తాను మొదటి భార్య కాదు అని చెప్పిన మాటలు ప్రస్తుతం మరోసారి వైరల్ అవుతుంది అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
2019లో ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ, "చైతన్యకు మొదటి భార్య నేను కాదు. ఆయన మొదటి భార్య ఆయనే ఎక్కువ ప్రేమించే.. ఓ దిండు. ఎప్పుడు దాంతోనే ఉంటారు" అని సరదాగా చెప్పింది. ఆమె మాటల ప్రకారం, చైతన్య ఎప్పుడూ దిండు పక్కనే పెట్టుకొని ఉంటాడని, ఇక దానిని తనకంటే ఎక్కువ ప్రేమిస్తాడని చెప్పింది. మరోసారి ఈ సమంత మాటలు వైరల్ అవుతున్నాయి
2017లో ఘనంగా పెళ్లి చేసుకున్న చైతన్య, సమంత 2021లో విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు వెళ్లారు. ఆ తరువాత చైతన్య శోభిత ధూళిపాళను ప్రేమించి..2024లో వివాహం చేసుకున్నాడు. మరోవైపు, సమంత దర్శకుడు రాజ్ నిదిమొరుతో డేటింగ్‌లో ఉందనే వార్తలు వస్తున్నాయి.
తాజాగా నాగ చైతన్య తన కొత్త చిత్రం థాండెల్ ప్రమోషన్‌లో మాట్లాడుతూ, తన వివాహంపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించాడు. "ఈ విమర్శలు నాకు అంతగా బాధ కలిగించవు, కానీ శోభితకు తగిలితే బాధేస్తుంది. ఆమె దీనికి అర్హురాలు కాదు" అని చెప్పాడు.
నాగ చైతన్య మాట్లాడుతూ, "నేను విడాకులను లైట్‌గా తీసుకోను. మా కుటుంబం గతంలోనే విడిపోయిన నేపథ్యంలో, నేను అన్ని కోణాల్లో ఆలోచించాకే నిర్ణయం తీసుకున్నా. మా విడాకులు ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇద్దరికీ మంచిదని అర్థమయ్యాకే మేము దాన్ని అంగీకరించాం" అని చెప్పాడు. ఇప్పుడు సమంత, చైతన్య ఇద్దరూ తమ కెరీర్, వ్యక్తిగత జీవితాల్లో ముందుకు వెళ్లిపోయారు. కానీ వారి విడాకులు, గత జీవితం ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది.