Add Zee Business As A Preferred Source
App

Samantha: ఫైనల్ గా సమంత పెళ్లి డేట్ ఫిక్స్.. నవంబర్ నెలలో ఆరోజే..!

Written ByVishnupriya
Published: Sep 27, 2025, 09:58 PM IST|Updated: Sep 27, 2025, 09:58 PM IST


Samantha Marriage Date
సమంత పెళ్లి గురించి గత కొద్ది రోజులగా ఎన్నో వార్తలు వినిపిస్తూ వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలకు కాస్త త్వరలోనే శుభం కార్డు పడెతట్టు కనిపిస్తోంది. సమంతకు పెళ్లి ఫిక్స్ అయిందని అలానే ఆ పెళ్లి డేట్ కూడా తెగ సర్కులేట్ అవుతోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
 

Samantha Marriage 1/5

సమంత నవంబర్ పెళ్లి,

సమంత పెళ్లి గురించి.. ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వినిపిస్తూ వస్తూనే ఉంది. ఇప్పటికే సమంతకు నాగచైతన్యతో పెళ్లై ఆ తరువాత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

Samantha Second Marriage 2/5

సమంత రాజ్ పెళ్లి వార్తలు,

వీరిద్దరూ విడాకులు తీసుకున్న దగ్గర నుంచి సమంత రెండో పెళ్లి చేసుకుంటుందా లేదా అనే దానిపై ఎన్నో చర్చలు జరిగాయి. ఇక సమంతకన్నా ముందు నాగచైతన్య పెళ్లి చేసుకొని పెద్ద షాక్ ఇచ్చారు. 

Samantha Second Marriage Date 3/5

నాగచైతన్య

ఇక నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడంతో.. అభిమానులు అందరూ కూడా.. సమంత రెండో పెళ్లి ఎప్పుడు అనే దానిపైన.. ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు.  అంతేకాకుండా సమంత దర్శకుడు రాజ్ తో ప్రేమాయణం నడుపుతోంది అని ఎన్నో రోజుల నుంచి.. వార్తలు వినిపిస్తూ ఉండగా.. ఇందుకు తగ్గట్టుగానే సమంత అతనితో ప్రతి దగ్గర కలిసి కనిపిస్తోంది. 

Samantha Raj Marriage Date 4/5

సమంత పెళ్లి డేట్,

ఇక మొన్న కూడా జిమ్ నుంచి సమంత వచ్చి రాజ్ తోపాటు కార్ ఎక్కి వెళ్ళిపోయింది. ఇలాంటి వీడియోలు అన్నీ కూడా.. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమను చెప్పకనే చెబుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరూ పెళ్లికి కూడా సిద్ధమైపోయినట్టు సమాచారం. 

Samantha Marriage With Raj5/5

సమంత

కార్తీకమాసం మొదలైన తరువాత నవంబర్ నెలలో వీరిద్దరి పెళ్లి ముహూర్తం ఈ మధ్య ఫిక్స్ అయినట్టు.. కొన్ని రూమర్లు తెగ వినిపిస్తున్నాయి. వీటి పైన ఇంకా ఎటువంటి క్లారిటీ.. అలానే అధికారిక ప్రకటన లేకపోయినా.. దాదాపు వీరిద్దరు పెళ్లి ఈ సంవత్సరం నవంబర్లో ఉండొచ్చు అని వినికిడి. అంతేకాదు సమంత అందుకే సినిమాలు ఏవి ఒప్పుకోలేదని కూడా తెలుస్తోంది.