Samantha and Raj: సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌత్ ఇండియాలో తనకంటూ ఎంతో పేరు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం నార్త్ ఇండియాలో కూడా ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలో సమంతా ఇంస్టాగ్రామ్ లో సైతం ఎంతో ఆక్టివ్ గా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
సినిమాలపరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత.. ఇంస్టాగ్రామ్ లో సైతం ముందంజలో ఉంటుంది. ఎంతోమంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న సమంత ఇంస్టాగ్రామ్ లో తరచూ తన అప్డేట్ షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఈ క్రమంగా తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో బంగారపు రంగు చీరలో మెరిసిపోయింది సమంత.
ఇక ఈ ఫోటోలలోని.. కొద్దిరోజుల నుంచి తన రిలేషన్షిప్ లో ఉంది అని వినిపిస్తున్న ఫ్యామిలీ మాన్ దర్శకుడు రాజ్ తో కనిపించింది. చెన్నైలో ఒక ఈవెంట్ కి వీరిద్దరూ కలిసి అటెండ్ అవ్వగా.. ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలను సమంత షేర్ చేయడం విశేషం.
ఇక ఈ ఫోటోలకు క్యాప్షన్ గా “15 సంవత్సరాలు అయింది.. మీ ఆశీస్సులు, ప్రేమతో.. ఇంకా ఎన్నో సంవత్సరాలు రానున్నాయి. చెన్నై వారందరికీ కూడా నా ధన్యవాదాలు..” అంటూ రాసుకువచ్చింది.
బిహైండ్ వుడ్ గోల్డ్ హల్ ఆఫ్ ఫ్ఫెమేర్స్ ఈవెంట్ కి.. సమంతకు అవార్డు సైతం లభించింది. ఇక ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు ఈమె అభిమానులు.