Samantha Personal Life : సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సమంత గురించి చిన్న వార్త కూడా పెద్దగా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా సమంత ఫోటోలు కొన్ని వైరల్ అవుతూ.. ఆశ్చర్యపరుస్తున్నాయి.. ఇంతకీ ఆ ఫోటోలు ఏమిటి అన్న విషయానికి వస్తే..
1/5వరస సినిమాలు చేస్తూ.. అలానే వరసగా స్టార్ హీరోలతో నటిస్తూ.. ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగింది సమంత.
2/5అయితే ప్రస్తుతం మాత్రం సమంత సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అది కేవలం ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడానికి.. తీసుకున్న సమయం అనేది అందరికీ తెలిసిన విషయమే.
3/5ఈ క్రమంలో తాజాగా ఇంస్టాగ్రామ్ లో లో వైరల్ అవుతున్న ఫోటోలు మాత్రం .. అందరినీ తెగ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రస్తుతం జెమిని అలానే చాట్ జిపిటి ట్రెండ్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ క్రమంలో సమంత 3వ నెల ప్రెగ్నెంట్ అంటూ కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
4/5ఇక ఈ ఫోటోలలో నిజంగానే సమంత బేబీ బంప్ ఉండడం.. ఈ ఫోటోలు నిజమైన ఫోటోలతో అస్సలు తేడా లేకపోవడం.. చూసి చాలామంది నిజంగానే సమంతకు మూడో నెల ప్రెగ్నెన్సీనా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
5/5అంతేకాదు మరి కొంతమంది అందుకే సమంత సినిమాలకు దూరంగా ఉందా అని కూడా ఆ ఫోటోలో కింద కామెంట్ పెడుతున్నారు. మొత్తం పైన ఈ ఏఐ ఫోటోలు చూస్తుంటే అసలు ఏది నిజం, ఏది అబద్దమో తెలియకుండా పోతుంది అనేది మాత్రం జగమెరిగిన సత్యం.